జగన్ సర్కార్ కు హైకోర్టు షాక్-కర్నూలుకు ఆఫీసుల తరలింపుపై కీలక ఆదేశం-రాజధానుల తీర్పు బట్టే
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఇవాళ మరో బ్రేక్ పడింది. ఏపీలోని అమరావతిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్ని కర్నూలుకు కానీ, విశాఖకు కానీ తరలించకూడదంటూ గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి ఇంకా తరలించని కార్యాలయాల్ని సైతం ఈ రాజధానులకు తరలించే విషయంలో హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో మూడు రాజధానుల పిటిషన్ల విచారణ పూర్తయి తీర్పు కోసం జగన్ సర్కార్ ఎదురుచూడక తప్పని పరిస్ధితి ఏర్పడింది.

మూడు రాజధానులపై మరో షాక్
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం వైసీపీ ప్రభుత్వం దాదాపు రెండేళ్లుగా విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా అసెంబ్లీలో రెండు కీలక బిల్లుల్ని ఆమోదించడమే కాకుండా వాటికి గవర్నర్ ఆమోద ముద్ర కూడా వేయిచుకుంది. దీంతో రాజధానుల ఏర్పాటు పూర్తయినట్లేనని భావిస్తున్న తరుణంలో హైకోర్టులో వీటిని వ్యతిరేకిస్తూ దాదాపు వందకు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో వీటి విచారణ చేపట్టిన హైకోర్టు.. తుది తీర్పు వచ్చే వరకూ ఇతర రాజధానులకు అమరావతి నుంచి కార్యాలయాల తరలింపు చేపట్టకుండా ఆదేశాలు జారీ చేసింది. ఇది కొనసాగుతుండగానే మరో అంశంలోనూ జగన్ సర్కార్ కు బ్రేక్ పడింది.

కర్నూలుకు ఆఫీసుల తరలింపు
ఏపీలో ప్రస్తుత రాజధాని అమరావతి నుంచి న్యాయ, కార్యనిర్వాహక రాజధానులైన కర్నూలు, విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై హైకోర్టు నిషేధం అమల్లో ఉంది. అదే సమయంలో విభజన పూర్తయినా హైదరాబాద్ లోనే ఉండిపోయిన హెచ్ఆర్సీ, లోకాయుక్త కార్యాలయాల్ని ఎందుకు ఏపీకి తరలించడం లేదంటూ హైకోర్టు వైసీపీ సర్కార్ ను గతంలో ప్రశ్నించింది. దీంతో ఇదే అదనుగా వాటిని హైదరాబాద్ నుంచి కర్నూలుకు తరలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే కాకుండా గెజిట్ నోటీఫికేషన్లు జారీ చేసింది. వీటి ఆధారంగా సదరు కార్యాలయాల తరలింపు కూడా జరిగిపోతోంది.

తరలింపుకు వ్యతిరేకంగా పిటిషన్లు
న్యాయరాజధాని అయిన కర్నూలుకు హెచ్చార్సీతో పాటు లోకాయుక్త కార్యాలయాల్నితరలిస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం, అనంతరం దీనిపై విడుదల చేసిన గెజిట్ ను సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. మూడు రాజధానులపై దాఖలైన పిటిషన్ల విచారణ పూర్తి కాకుండా ఈ కార్యాలయాల తరలింపు ఏంటని పిటిషనర్లు ప్రశ్నించారు. దీంతో హైకోర్టు ఈ అంశంపై విచారణ జరిపింది. ప్రభుత్వ వాదనలు కూడా విన్న తర్వాత ఇవాళ హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది.

జగన్ సర్కార్ కు హైకోర్టు షాక్
ఏపీ హెచ్చార్సీ, లోకాయుక్త కార్యాలయాల్ని న్యాయరాజధాని అయిన కర్నూలుకు తరలించేందుకు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు, గెజిట్ నోటిఫికేషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. వైసీపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. కర్నూలుకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు మూడు రాజధానులపై హైకోర్టు ఇచ్చే తుది తీర్పుకు లోబడే ఉంటుందని స్పష్టం చేసింది. ఈ కార్యాలయాల్ని తాత్కాలికంగా కర్నూలు తరలించినా రేపు హైకోర్టు మూడు రాజధానులకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే మాత్రం వీటిని అమరావతి తరలించాల్సి ఉంటుందనేది హైకోర్టు తీర్పు సారాంశం. హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త ఏర్పాటు తుది తీర్పునకు లోబడి ఉంటుందని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Recommended Video
-
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!! -
ఇక మంటలే: ఈరోజు, రేపు బయటకు రావద్దు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరికలు..!! -
అమరావతి పై వెంకయ్య కీలక ప్రతిపాదన, అమిత్ షా అంగీకారం..!! -
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
Amaravati: అమరావతిపై అసెంబ్లీ తీర్మానం-ఇవాళే కేంద్రానికి-చంద్రబాబు కామెంట్స్..! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications