వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భాష కాదు, 10మంది రోజాలు వచ్చినా, ఎన్టీఆర్‌కు ఆనాడే చెప్పా: వాణీ విశ్వనాథ్

తాను టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నానని వాణీ విశ్వనాథ్ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. వైసిపి అధినేత జగన్ జగన్ పాదయాత్రనే కాదు, మోకాళ్ల యాత్ర చేసినా ఎలాంటి లాభం లేదన్నారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: తాను టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నానని వాణీ విశ్వనాథ్ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. వైసిపి అధినేత జగన్ జగన్ పాదయాత్రనే కాదు, మోకాళ్ల యాత్ర చేసినా ఎలాంటి లాభం లేదన్నారు.

వాణీ విశ్వనాథ్ వస్తే టీడీపీకి చిక్కులు వస్తాయా?వాణీ విశ్వనాథ్ వస్తే టీడీపీకి చిక్కులు వస్తాయా?

 పదిమంది రోజాలను ఎదుర్కోగలను

పదిమంది రోజాలను ఎదుర్కోగలను

తనకు పదిమంది రోజాలను ఎదుర్కొనే సత్తా ఉందని వాణి అన్నారు. మీరంతా ఆశిస్తున్నట్లు తాను త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరుతానని వాణీ విశ్వనాథ్ అన్నారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిలో పాలుపంచుకోవాలనే టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

 తెలుగు రాకపోవడం సమస్య కాదు

తెలుగు రాకపోవడం సమస్య కాదు

ఎమ్మెల్యే రోజాను ఎదుర్కోగలననే నమ్మకం తనలో ఉందని వాణీ విశ్వనాథ్ చెప్పారు. ప్రత్యర్థులను ఎదుర్కోవాలంటే భాష ముఖ్యం కాదని, తనకు తెలుగు బాగా రాకపోవడం అన్నది సమస్యే కాదన్నారు.

 రోజాతో ఎలాంటి విభేదాలు లేవు

రోజాతో ఎలాంటి విభేదాలు లేవు

వ్యక్తిగతంగా ఎమ్మెల్యే రోజాకి తనకు ఎలాంటి పోటీ, విభేదాలు లేవని వాణీ విశ్వనాథ్ స్పష్టం చేశారు. పార్టీలో చేరిన తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడుతానని చెప్పారు. మొదట పార్టీలో చేరాల్సి ఉందన్నారు.

 ఆనాడు ఎన్టీఆర్‌కు చెప్పా

ఆనాడు ఎన్టీఆర్‌కు చెప్పా

పాదయాత్ర చేస్తే వారి పాపాలు పోతాయని, అందుకే జగన్ పాదయాత్ర చేస్తున్నారని, కానీ లాభం లేదన్నారు. తనను రాజకీయాల్లోకి రావాలని అప్పట్లో ఎన్టీఆర్ అడగలేదని, రాజకీయాలంటే ఇష్టమా అని మాత్రమే అడిగారని చెప్పారు. సినిమాల్లో నటించాలని ఉందని అప్పుడు చెప్పానని, భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తే మీ పార్టీలోనే చేరుతానని నాడు ఆయనకు చెప్పానని తెలిపారు.

English summary
Actress Vani Vishwanath on Tuesday said that she is ready to face YSR Congress Party MLA Roja in next general elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X