• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపీలో డిక్టేటర్‌ షిప్: ఆందోళనల అణచివేత.. ఎమ్మార్పీఎస్ కురుక్షేత్ర సభకు అష్టదిగ్బంధం

By Swetha Basvababu
|

అమరావతి/గుంటూరు: ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ అయినా అధికారంలో ఉన్న పార్టీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనడానికి స్పష్టమైన సంకేతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమే. 2014 ఎన్నికలకు ముందు తమకు అధికారం అప్పగిస్తే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కృషి చేస్తామని హామీలు గుప్పించిందే టీడీపీ అధ్యక్షుడు, ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.

అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే మరిచిపోయారాయన. ఆ సంగతి గుర్తు చేయడానికి 'కురుక్షేత్రం' పేరిట గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ పక్కన సభ నిర్వహణకు ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ సిద్ధమయ్యారు. కానీ స్వేచ్ఛగా అభిప్రాయాల వెల్లడికి ప్రజాస్వామ్యంలో చోటు ఉన్నా.. రాజధాని సమీపాన నిరసన సభ జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం పోలీసుశాఖను ఉపయోగించుకున్నది.

సాధారణంగా వివిధ వర్గాల ప్రజలు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళనలు చేయడం సర్వ సాధారణ పరిణామం. గుంటూరులోని నాగార్జున యూనివర్శిటీ చుట్టూ పోలీసుశాఖ సహకారంతో పూర్తిస్థాయిలో అష్ట దిగ్బంధం చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆందోళనకు దిగేవారు తమకు నచ్చిన రీతిలో నిరసన తెలిపేందుకు పూనుకున్నారు.

Is dictatorship implemented in AP

ఈ క్రమంలో మంగళగిరి పరిసర ప్రాంతాలు, నాగార్జున యూనివర్సిటీ పరిధిలోనూ ముందుగానే వచ్చే చేరిన ఆందోళనకారులు తమదైన రీతిలో నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. అదీ కూడా చంద్రబాబు సర్కార్‌కు కంటగింపుగానే మారినట్లు కనిపిస్తున్నది. ఎమ్మార్పీఎస్ అధినేత మందక్రుష్ణ మాదిగను గుంటూరు ఆసుపత్రిలో అడ్డుకుని.. తెలంగాణ సరిహద్దుల్లో వదిలి పెట్టారు. కానీ ఆయన కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు.

సాధారణ నిరసన సభకు కూడా అనుమతించకపోవడంతో విజయవాడ ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసేందుకు కూడా పోలీసులు, చంద్రబాబు ప్రభుత్వం అంగీకరించలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మందక్రుష్ణ మాదిగ మీడియా సమావేశం నిర్వహించకుండా అడ్డుకోవాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించడం, తు.చ. తప్పకుండా పోలీసులు అమలు చేశారు.

  Chandrababu attends the World Economic Forum's annual conference in Davos

  మందక్రుష్ణను తిరిగి తెలంగాణకు పంపివేశారు. దీనిపై చివరిగా మీడియాతో మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు మాట్లాడుతూ కురుక్షేత్ర సభ పేరుతో జరిగిన హింసాత్మక ఘటనల్లో మొత్తం 12 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. పోలీసు ఆంక్షలను ఉల్లంఘించి ర్యాలీలు, సభలంటూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.

  కోర్టు సూచనను సైతం ఆదేశంగా వక్రీకరించి ఎమ్మార్పీఎస్‌ నేతలు తమ కార్యకర్తలను తప్పుదోవ పట్టించారన్నారు. నాగార్జున యూనివర్సిటీ సమీపంలో అల్లర్లకు పాల్పడిన వారిని, కృష్ణా జిల్లాలోకి ప్రవేశించే చెక్‌పోస్టు వద్ద పోలీసు ఔట్‌పోస్టును తగులబెట్టిన వారిని గుర్తించామని తెలిపారు.

  ఎవ్వరినీ వదిలే ప్రసక్తే లేదని, బాధ్యులను తప్పకుండా అరెస్టు చేస్తామని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి తమ వద్ద వీడియో ఆధారాలు ఉన్నాయన్నారు. ఆధారాల్లేకుండా ఎవ్వరినీ అరెస్టు చేయబోమని స్పష్టం చేశారు. కేసుల విచారణకు ముగ్గురు డీఎస్పీల నేతృత్వంలో ఆరు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

  ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తల విధ్వంసంలో నష్టం రూ.10లక్షలపైనే ఉంటుందని, దాన్ని సభ నిర్వాహకుల నుంచి వసూలు చేసేందుకు చట్టపరంగా ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు డీజీపీ తెలిపారు. అంతకుముందు సీఎం వద్ద జరిగిన సమీక్షలో పోలీసు వైఫల్యంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.

  ఎమ్మార్పీఎస్ ఘటనలో పోలీసుల వైఫల్యంపై డీజీపీ సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిసర గ్రామాల్లో మాటు వేసిన వారిని పోలీసులు పసిగట్టలేకపోయారని మండిపడ్డారు. ఆందోళన జరిగిన ప్రదేశంలో నిఘా కెమెరాలు ఏర్పాటు చేశామని డీజీపీ సాంబశివరావు చెప్పారు. ఆందోళనలో అనుమానాస్పదంగా ఉన్న వారిని గుర్తించామని తెలిపారు. విధ్వంసానికి పాల్పడిన వారు వెంటనే లొంగిపోవాలని, తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని తప్పకుండా పట్టుకుంటామని డీజీపీ తెలిపారు.

  కురుక్షేత్ర సభ వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది: అనిత

  మందకృష్ణ మాదిగ కురుక్షేత్ర సభ వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందని పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అనిత ఆరోపించారు. మాల, మాదిగలకు సీఎం చంద్రబాబుకు రెండు కళ్లు అని అనిత అన్నారు. వర్గీకరణ ఆలస్యమవుతోందనే ప్రభుత్వం జీవో నెం.25ని విడుదల చేసిందని ఎమ్మెల్యే అనిత అన్నారు.

  బాబుపై మందకృష్ణ ఆరోపణలు సరికాదు: టీడీపీ నేతలు

  ఏపీ సీఎం చంద్రబాబుపై మందకృష్ణ ఆరోపణలు సరికాదని టీడీపీ నేతలు డొక్కామాణిక్య వరప్రసాద్, డేవిడ్‌రాజు అన్నారు. కురుక్షేత్రం పేరుతో అల్లర్లు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ అంశం ఢిల్లీలో నడుస్తున్నందున అందుకు అనుగుణంగా మాదిగలు పోరాటం చేయాలన్నారు. ఎస్సీ వర్గీకరణపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన విధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

  చంద్రబాబు మోసానికి నిరసనే కురుక్షేత్ర మహాసభ: మంద కృష్ణ

  'షెడ్యూల్డ్‌ కులాల వర్గీకరణపై ఏపీ సీఎం చంద్రబాబు చేసిన మోసానికి నిరసనగా కురుక్షేత్ర మహాసభ తలపెట్టాం. బాబుపై పోరాటం మొదలైంది' అని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. శనివారం తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాకేంద్రంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ 'తెలంగాణలో మా మద్దతుతో పాదయాత్ర చేసి .. ఆంధ్రాలో మా ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మమ్మల్ని విస్మరించడం సరికాదు' అని అన్నారు. హైకోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయకుండా ప్రభుత్వం కురుక్షేత్ర మహాసభను అడ్డుకుందని ఆరోపించారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  AP government had blocked MRPS Meeting 'Kurukshetram' for SC reservation categerisation Guntur. AP police has arranged barricades arround Guntur Nagarjuna University and releive Manda krishna in Telangana border.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more