నరకం చూశా: నైజీరియాలో కిడ్నాపైన ఇంజినీర్ సాయి శ్రీనివాస్

Subscribe to Oneindia Telugu

విశాఖపట్నం: నెల రోజుల క్రితం నైజీరియాలో కిడ్నాప్ నకు గురై వారి చెర నుంచి బయటపడ్డ విశాఖపట్నం వాసి ఇంజనీరు సాయి శ్రీనివాస్(44) నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

డబ్బు కోసమే కిడ్నాపర్లు తనను కిడ్నాప్ చేశారని, వారి చెరలో తాను నరకం చూశానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సహకారం, దేవుడి దయ వల్ల తాను బతికి బయటపడ్డానని అన్నారు.

Also Read: నైజీరియాలో ఇద్దరు ఏపీ ఇంజినీర్ల కిడ్నాప్: కుటుంబసభ్యుల వేడుకోలు

Kidnapped Engineer reached Visakhapatnam

కాగా, మూడేళ్లుగా నైజీరియాలో ఉంటున్న సాయి.. అక్కడి గంగోటి సిమెంట్ కర్మాగారంలో సివిల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. జూన్ నెలలో సాయి శ్రీనివాస్, అనీష్ శర్మలు కిడ్నాప్ నకు గురైన విషయం తెలిసిందే.

అంతకుముందు 17 రోజుల నిర్బంధం తర్వాత సాయి శ్రీనివాస్ ను నైజీరియా కిడ్నాపర్లు వదిలిపెట్టారు. దీంతో కిడ్నాపర్ల నుంచి బయటపడిన వెంటనే కుటుంబసభ్యులకు తన క్షేమ సమాచారాన్ని చేరవేశాడు సాయి శ్రీనివాస్. సాయి శ్రీనివాస్ ఫోన్‌తో అతని కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఇంటికి రావడంతో సాయి శ్రీనివాస్ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sai Srinivas, A Engineer, who is kidnapped in Nigeria, has reached Visakhapatnam.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి