వివాహితతో యువకుడి ప్రేమ, ఇంటి నుండి పారిపోయి చివరికిలా....

Posted By:
Subscribe to Oneindia Telugu

నెల్లూరు: ప్రేమికులు బలన్మరణానికి పాల్పడ్డారు.వివాహిత స్త్రీతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది.అయితే వివాహితతో కలిసి యువకుడు గ్రామం విడిచి వెళ్ళిపోయారు. అయితే కారణాలు ఏమిటో తెలియదు కాని వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు.

నెల్లూరు జిల్లా కొండాపురం మండలం తూర్పు ఎర్రబల్లి గ్రామానికి చెందిన మండవ వినయ్ అనే యువకుడు గుంటూరు జిల్లాలోని వినుకొండలో ఇంటింటికి స్టీల్ సామాన్లు విక్రయించేవాడు. వినుకొండలోనే ఓ గదిని అద్దెకు తీసుకొని నివాసం ఉండేవాడు.

lovers suicide in nellore district

అయితే ఈ క్రమంలోనే వినుకొండకు చెందిన ఎస్ కె జీనత్ తో వినయ్ కు పరిచయమేర్పడింది. జీనత్ కు చిన్నతనంలోనే సైదుల్లా అనే వ్యక్తితో వివాహమైంది. ఆమెకు ఓ కొడుకు ఓ కూతురు ఉన్నారు.

ఇదిలా ఉంటే వినయ్ , జీనత్ ల మధ్య పరిచయం వారిద్దరి మద్య ప్రేమకు దారితీసింది.వారిద్దరూ పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు.రెండు రోజుల క్రితం వారిద్దరూ వినుకొండను వదిలేసి నెల్లూరుకు వచ్చారు.

అయితే వారిద్దరూ ఏం ఆలోచించారో తెలియదు. శనివారం నాడు నెల్లూరు నగరంలోని విజయమహల్ గేటు సమీపంలోని రైలు పట్టాలపైకి చేరారు.గూడ్స్ రైలుకు ఎదురెళ్ళారు.

వీరిని పట్టాలపై గమనించిన స్థానికులు, ప్రయాణీకులు పెద్దగా కేకలు వేశారు, అయినా స్పందించలేదు. చివరి నిమిషంలో వినయ్ భయపడి తప్పించుకొనేందుకు ప్రయత్నించాడు. అయితే జీనత్ అతణ్ణి గట్టిగా పట్టుకొంది. రైలు ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మరణించారు.వినయ్ డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
lovers suicide in nellore district on saturday.vinay kumar, jeenath fell in love. jeenath married saifullah, she has two children.vinay, jeenath went to nellore from vinukonda. they suicide on saturday.
Please Wait while comments are loading...