గుంతకల్-మార్కాపూర్ రోడ్ మధ్య కొత్త రైలు..! ప్రతి రోజూ టైమింగ్స్ ఇవే..!
ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్ని కలుపుతూ మరో కొత్త రైలు పట్టాలెక్కబోతోంది. రాయలసీమలోని గుంతకల్లుతో మార్కాపురం జిల్లా మార్కాపురం రోడ్ స్టేషన్ ను కలుపుతూ ఈ రైలు ప్రయాణించించనుంది. దీనికి సంబంధించిన వివరాలను ఇవాళ దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ మేరకు ఈ రైలు ప్రారంభానికి ఆమోద ముద్ర వేసినట్లు అధికారులు తెలిపారు.
దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదన మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ గుంతకల్లు -మార్కాపూర్ రోడ్-గుంతకల్లు పాసింజర్ రైలు ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రతీ రోజూ ప్రయాణించే ఈ రైలు నంద్యాల మీదుగా వెళ్తుంది. ఈ రైలు సేవలు త్వరలో అందుబాటు లోకి రానున్నాయని అధికారులు తెలిపారు. రైలు నం.57407/ 57408 గుంతకల్లు - మార్కాపూర్ రోడ్ - గుంతకల్లు రోజువారీ ప్యాసింజర్ రైలు సర్వీస్ యొక్క ప్రతిపాదిత సమయాల్ని కూడా వెల్లడించారు.

రైలు నం.57407 గుంతకల్లు నుంచి సాయంత్రం 5.30కు బయలుదేరే పాసింజర్ రైలు మార్కాపూర్ రోడ్ స్టేషన్ కు రాత్రి 11.30కు చేరుకోనుంది. ఇది మధ్యలో నంద్యాలలో రాత్రి 8.30కి ఆగనుంది. అలాగే రైలు నం.57408 మార్కాపూర్ రోడ్ నుంచి ఉదయం 10.30కు బయలుదేరి సాయంత్రం 4.30కు గుంతకల్లుకు చేరుకోనుంది. ఈ రైలు నంద్యాలలో ఉదయం 7.20కి ఆగనుంది. ఈ రైళ్లు మార్గ మధ్యంలో మద్దికెర, పెండేకల్లు, ధోన్ , రంగాపురం, బేతంచెర్ల, పాణ్యం, నంద్యాల, గాజులపల్లి, దిగువమెట్ట, గిద్దలూరు, సోమిదేవిపల్లె, జగ్గంభొట్ల కృష్ణాపురం, కంబం మరియు తర్లుపాడు స్టేషన్లలో ఇరు వైపు ప్రయాణంలో ఆగుతాయి.

అలాగే ఈ కొత్త ప్యాసింజర్ రైలు సర్వీసు ప్రారంభం ద్వారా గుంతకల్లు, మార్కాపూర్ రోడ్ మధ్య ప్రయాణించే వారికి ప్రయోజనం కూరడమేకాకుండా మార్గ మధ్యంలోని నంద్యాల, గిద్దలూరు, కంభం మొదలైన ప్రాంతాల ప్రజలకు ఎంతో ప్రయోజనం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ రైలు విద్యార్థులకు, వ్యాపారస్థులకు , ఇతర ప్రయాణికులకు పైన పేర్కొన్న స్టేషన్లకు చేరుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, తక్కువ ఛార్జీతో ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తుంది.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications