కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహాకూటమి ఏర్పడితే పవన్ కళ్యాణే సీఎం అభ్యర్థి: సీపీఐ రామకృష్ణ

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

కర్నూలు:మహాకూటమి ఏర్పడితే జనసేన అధినేత పవన్‌ కల్యాణే సిఎం అభ్యర్థి, అందులో ఎటువంటి సందేహానికి తావులేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా ఆలూరు ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

Recommended Video

అలా చేస్తే పవన్ కింగ్ మేకర్ అవుతాడా ??

పవన్ కళ్యాణ్ కు రాజకీయాలపై మంచి అవగాహన ఉందన్నారు. అంతేకాకుండా ప్రజల్లో పవన్‌కు ఇమేజ్‌, క్రేజ్‌ రెండూ ఉన్నాయని, అలాంటి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు సీఎం అయితే బాగుంటుందని రామకృష్ణ అభిప్రాయపడ్డారు. కడప ఉక్కు పరిశ్రమకు సంబంధించి గాలి జనార్దన్‌ రెడ్డి తనకు రెండేళ్ల సమయం ఇస్తే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

Pawan Kalyan would be the CM Candidate:CPI Ramakrishna


ఇక రాష్ట్రాభివృద్ధికి కేంద్రం 85 శాతం నిధులు ఇచ్చినట్లుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పడం సిగ్గుచేటని రామకృష్ణ మండిపడ్డారు. బీజేపీతో ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా పొత్తులు పెట్టుకుంటే ప్రజలే ఆ పార్టీలకు బుద్ధిచెబుతారని వైసిపిని ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలతో ఈ నెల 4న విజయవాడలో సమావేశం నిర్వహించనున్నామని, ఆ సమావేశంలో తదుపరి కార్యచరణ రూపొందిస్తామని రామకృష్ణ చెప్పారు.

English summary
Kurnool:CPI state secretary Ramakrishna made it clear that Pannan Kalyan would be the chief minister if "Maha kumami" will form.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X