నర్సాపురం నుంచి వందేభారత్ పై రైల్వే తాజా నిర్ణయం, తిరుపతికి ఇక నుంచి..!!
వందేభారత్ ప్రయాణీకులకు రైల్వే శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల నుంచి వందే భారత్ కు ఆక్యుపెన్సీ పెరుగుతోంది. ప్రయాణీకుల డిమాండ్ మేరకు కొత్త సర్వీసులను రైల్వే అధికారులు అందుబాటులోకి తెస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటి వరకు విజయవాడ - చెన్నై మధ్య కొనసాగుతున్న వందేభారత్ ను నర్సాపురం వరకు పొడిగించారు. ఈ రైలు ప్రారంభం పై రైల్వే శాఖ తాజా ప్రకటన చేసింది. శ్రీవారి భక్తుల కోసం తిరుపతికి వెళ్లే వందే భారత్ రైళ్ల పైన కీలక నిర్ణయం తీసుకుంది.
చెన్నైకు వెళ్లే ఏపీ ప్రయాణీకులకు రైల్వే శాఖ కీలక సమాచారం ఇచ్చింది. సుదీర్ఘ నిరీక్షణ తరువాత విజయవాడ నుంచి ప్రస్తుతం చెన్నై వరకు నడుస్తున్న వందేభారత్ కు నర్సాపురం వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 12న ఈ రైలును ప్రారంభించేందుకు ముహూర్తంగా నిర్ణయించారు. అయితే, ఈ నెల 15వ తేదీ నుంచే ఈ రైలును అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేసారు.

ఈ రైలు టైమింగ్స్ ను వెల్లడించారు. ప్రస్తుతం చెన్నై సెంట్రల్లో ఉదయం 5.30 గంటలకు బయలుదేరే వందే భారత్ రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి స్టేషన్ల మీదుగా విజయవాడకు 12.10కి చేరుతోంది. పొడిగించిన సర్వీసు 11.45 గంటలకు విజయవాడకు చేరుకొని, అక్కడి నుంచి 11.50కి బయల్దేరి మధ్యాహ్నం 12.25కు గుడివాడ, 1.30కి భీమవరం, 2.10కి నరసాపురం చేరుతుందని వెల్లడించారు.
కాగా, ఇదే రైలు తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.50 గంటలకు నరసాపురంలో బయలుదేరి 3.20కి భీమవరం, 4.10కి గుడివాడ, 4.50కి విజయవాడకు చేరుతుంది. ఇక్కడి నుంచి 4.55 గంటలకు బయలుదేరి, సాయంత్రం 5.20కి తెనాలి, 6.30కి ఒంగోలు, రాత్రి 7.40కి నెల్లూరు, 8.50కి గూడూరు, 9.50కు రేణిగుంట మీదుగా రాత్రి 11.45 గంటలకు చెన్నై సెంట్రల్ స్టేషన్‌కు చేరుతుంది. ఇక.. సికింద్రాబాద్ - తిరుపతి సహా 7 మార్గాల్లో నడిచే వందే భారత్ రైళ్ల కోచ్‌ల సంఖ్యను పెంచాలని రైల్వే బోర్డు నిర్ణయించింది.
సికింద్రాబాద్- తిరుపతి, మంగళూరు సెంట్రల్- తిరువనంతపురం, చెన్నై ఎగ్మోర్-తిరునల్వేలి, మదురై-బెంగళూరు కంటోన్మెంట్, దేవ్‌గఢ్-వారణాసి, హవ్డా-రౌర్కెలా, ఇందౌర్-నాగ్‌పుర్ మధ్య నడిచే వందే భారత్ రైళ్లలో మరికొన్ని కోచ్‌లు అందుబాటులో ఉండనున్నాయి. ఇక.. విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు ఖరారు చేసిన వందేభారత్ సంక్రాంతికి పట్టాలెక్కే అవకాశం ఉందని సమాచారం.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications