వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం సాక్షిగా అవమానం!: దేవినేనిని అడ్డుకున్న సెక్యూరిటీ

సీఎం సాక్షిగా నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు సీఎం సాక్షిగా అవమానం ఎదురైంది.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఏవోబీలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు భద్రతను మరింత పెంచారు. ఎంతగా అంటే తెలియని వ్యక్తులు ఎవరూ కూడా భద్రతాదళాలను దాటుకుని చంద్రబాబు దగ్గరకు వెళ్లలేరు. ఈ క్రమంలోనే సీఎం సాక్షిగా నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు సీఎం సాక్షిగా అవమానం ఎదురైంది.

వివరాల్లోకి వెళితే.. మంగళవారం విజయవాడలో టీడీపీ వర్క్‌షాప్‌ జరిగింది. ఈ సమావేశంలో పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా, ఈ సమావేశానికి హాజరైన మంత్రి దేవినేని... సీఎం చంద్రబాబుతో ప్రత్యేకంగా మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే చంద్రబాబుకు సెక్యూరిటీగా ఉన్న కమాండోలు ఆయన్ను అడ్డుకున్నారు.

Security stops Devineni to meet CM

కాగా, చంద్రబాబు అడుగు దూరంలో ఉన్నా కలవలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మంత్రి దేవినేని కాస్త అసంతృప్తికి లోనయ్యారు. అయితే, చంద్రబాబుకు ఇటీవల ఏవోబీ ఎన్‌కౌంటర్ అనంతరం సెక్యూరిటీ పెంచారు. ఈ సెక్యూరిటీ సిబ్బంది తరుచుగా మారుతుంటారు.. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరన్న విషయం వారికి తెలియదు. ఈ క్రమంలోనే మంత్రి దేవినేని ఉమను అడ్డుకున్నట్లు తెలుస్తోంది.

సెక్యూరిటీ కమాండోలకు తెలుగు రాకపోవడం కూడా ఇందుకు ఓ కారణంగా తెలుస్తోంది. అయితే, స్థానిక పోలీసులు జోక్యం చేసుకుని ఆయన మంత్రి అని చెప్పడంతో అప్పుడు చంద్రబాబు దగ్గరికి కమాండోలే దగ్గరుండి తీసుకెళ్లారు.

English summary
Security of CM stopped minister Devineni Uma maheswara Rao to meet Chandrababu naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X