తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీవారికి రూ.2కోట్ల విలువైన స్వర్ణ ఖడ్గం బహూకరించిన భక్తుడు

|
Google Oneindia TeluguNews

తిరుపతి: తిరుమల శ్రీవారికి తమిళనాడుకు చెందిన భక్తుడు భారీ స్వర్ణాభరణం కానుకగా సమర్పించారు. తమిళనాడులోని తేని జిల్లా బోడినాయకలూర్‌కు చెందిన పారిశ్రామికవేత్త తంగదొరై దంపతులు.. రూ.2 కోట్ల విలువైన బంగారు ఖడ్గం తయారుచేయించి స్వామివారికి బహుకరించారు.

Tamil Nadu devotee to donate Rs 2-crore sword

మంగళవారం వేకువ జామున సుప్రభాత సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న వారు... ఆలయ అధికారులకు స్వర్ణసూర్య కఠారిని అందజేశారు. ఆరు కిలోల మేలిమి బంగారంతో ఆభరణాన్ని తయారు చేయించినట్లు తంగదొరై దంపతులు తెలిపారు.

Tamil Nadu devotee to donate Rs 2-crore sword

1989లో కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన వీరేంద్ర పాటిల్‌ రాష్ట్ర ప్రభుత్వ తరఫున శ్రీవారికి స్వర్ణసూర్య కఠారిని సమర్పించారు. ఆ తర్వాత శ్రీవారికి ఇలాంటి కానుక అందడం ఇదే తొలిసారి. కాగా, తంగదొరై ఇప్పటి వరకు శ్రీవారికి రూ.5కోట్ల విలువైన ఆభరణాలను బహూకరించడం గమనార్హం.

English summary
A Tamil Nadu silk cotton merchant is going to donate Swarna Surya Katari, a gold sword, to Lord Venkateswara on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X