టీటీడీలో మరో భారీ స్కాం..! పదేళ్లలో 54 కోట్లు కొట్టేశారు..!
తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలిస్టర్ శాలువాలు రూ. 54 కోట్ల నష్టానికి కారణమయ్యాయని అంతర్గత విచారణలో తేలింది, ఇది ఏసీబీ విచారణ మరియు టెండర్ సంస్కరణలకు దారితీసింది.
ఏపీలో అత్యంత పవిత్రమైన శ్రీవారి ఆలయ వ్యవహారాలు చూస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో కల్తీ నెయ్యి, పరకామణి వివాదాలు చల్లారకముందే మరో కుంభకోణం చోటు చేసుకుంది. ఈసారి పట్టువస్త్రాల(శాలువాల) కొనుగోళ్లలో ఈ స్కాం జరిగింది. సిల్స్ శాలువాలకు బదులుగా పాలిస్టల్ శాలువాలు సరఫరా చేసి అక్రమార్కులు ఏకంగా రూ.54 కోట్లు కొట్టేసినట్లు తెలుస్తోంది. దీంతో మరోసారి టీటీడీ వ్యవహారశైలి చర్చనీయాంశమవుతోంది.
2015 నుండి 2025 వరకు పదేళ్ల పాటు ఇలా సిల్క్ శాలువాల స్ధానంలో పాలిస్టర్ శాలువాల సరఫరా మోసం జరిగిందని, స్వచ్ఛమైన మల్బరీ పట్టుకు బదులు పాలిస్టర్ శాలువలు సరఫరాలు చేసినట్లు టీటీడీ అంతర్గత నిఘా విచారణలో తేలింది. టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు దీనిపై ఆందోళన వ్యక్తం చేయడంతో విజిలెన్స్ విచారణ మొదలైంది. కాంట్రాక్టర్ టెండర్లలో పేర్కొన్న మల్బరీ పట్టు స్థానంలో చౌకైన పాలిస్టర్ వస్త్రాన్ని సరఫరా చేసినట్లు ఈ విచారణలో నిర్ధారించారు.

ఈ అక్రమాల కారణంగా టీటీడీ బోర్డుకు రూ.54 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. ఈ శాలువలను ప్రముఖ దాతలకు బహుమతులుగా వేదాశీర్వచనం వంటి ఆలయ కార్యక్రమాలలో ఇస్తున్నారు. సుమారు రూ.350 విలువైన శాలువాను రూ.1,300కు బిల్ చేశారని, ఇలా మొత్తం అక్రమాల విలువ రూ.50 కోట్లకు పైన ఉంటుందని అంచనా. దీనిపై ఏసీబీ విచారణ కోరినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.
టీటీడీ అధికారులు శాలువాల శాస్త్రీయ విశ్లేషణ కోసం వీటి నమూనాలను కేంద్రీయ పట్టు పరిశోధన మండలి (సీఎస్బీ)తో పాటు మరో ప్రయోగశాలకు పంపగా..అవి పాలిస్టర్ వస్త్రంగా తేలింది. ఇది టెండర్ నిబంధనల స్పష్టమైన ఉల్లంఘనే. అసలైన పట్టు ఉత్పత్తులకు ఉండాల్సిన సిల్క్ హోలోగ్రామ్ కూడా సరఫరా చేసిన నమూనాలలో లేదు. దీంతో ఇలా శాలువా వస్త్రం మార్చి సరఫరా చేసిన సంస్థపై విచారణ జరగబోతోంది.

విజిలెన్స్ నివేదికపై తక్షణమే స్పందించిన టీటీడీ ట్రస్ట్ బోర్డు.. సంబంధిత సంస్థతో ఉన్న అన్ని ప్రస్తుత టెండర్లను రద్దు చేసింది. పూర్తి స్థాయి నేర పరిశోధన నిమిత్తం ఈ కేసును ఏసీబీకి అప్పగించారని తెలుస్తోంది. ఇప్పటికే లడ్డూ కల్తీ వ్యవహారంతో టీటీడీ ప్రతిష్ఠ మసకబారింది. ఆ తర్వాత పరకామణి చోరీ వ్యవహారంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపై విచారణ జరుపుతుంటగానే ఫిర్యాదు చేసిన విజిలెన్స్ అధికారి శవమై తేలారు. దీంతో తిరుమలలో ఏం జరుగుతుందన్న చర్చ సామాన్య భక్తుల్లో మొదలైంది.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications