చంద్రబాబు సర్వేకు సచివాలయ ఉద్యోగుల ట్విస్ట్ ? ఆ తర్వాతే..!
ఏపీలో కూటమి సర్కార్ ఏడాదిన్నర పాలన పూర్తి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న అన్ని కుటుంబాల వివరాలు సేకరించి ఓ భారీ డేటాబేస్ ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారు. ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్ని ఇంటింటికీ పంపి వివరాలు సేకరించాలని నిర్ణయించారు. అయితే దీనిపై వారు ట్విస్ట్ ఇచ్చారు.
రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా చేపట్టనున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో ఏర్పడే సమస్యలపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఇవాళ సీఎస్, సచివాలయాలశాఖ డైరెక్టర్, కార్యదర్శి, ఇతర అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ ఫ్యామిలీ సర్వే (UFS) నిర్వహణలో గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు ఎదుర్కోబోయే వాస్తవ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు వారు తెలిపారు.

ప్రజలకు సరైన ప్రచారం, అవగాహన లేకుండా సర్వే ప్రారంభిస్తే సచివాలయ ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే సిబ్బంది కొరత, అధిక పని భారం, మొబైల్ ఫోన్లు-సిమ్ కార్డులు-బయోమెట్రిక్ పరికరాల లేమి, పాత మొబైల్ ఫోన్లలో యాప్‌లు సరిగా పనిచేయకపోవడం, సాంకేతికంగా సర్వర్ సమస్యలు వంటి అంశాలు సర్వే నిర్వహణకు అడ్డంకిగా మారుతాయని వారు తెలిపారు. సర్వే కోసం ఉద్యోగులు ఇంటింటికీ వెళ్ళే క్రమంలో సచివాలయాలలో ప్రభుత్వ సేవలు కుంటుపడుతాయని, అలాగేమీడియాలో ఇప్పటికే ఇంటింటి సర్వేలకు వెళ్లిన ఉద్యోగుల గురించి, ఖాళీ కుర్చీల ఫోటోలు వస్తున్నాయని వారు తెలిపారు.

అలాగే ఏకకాలంలో ఉద్యోగులు వారి మాతృశాఖల పనులతో పాటు,బూత్ లెవెల్ ఆఫీసర్ విధులు, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే నిర్వహణ అత్యంత భారంగా మారడంతో పాటు తీవ్రమైన వత్తిడి పెంచే ప్రమాదం ఉందని, పని ఒత్తిడి లేకుండా నిర్ధిష్ట ప్రణాళిక ప్రకారం ఈ సర్వే నిర్వహించాలని కోరారు. సర్వే నిర్వహణకు ముందు ఉద్యోగులకు పూర్తి స్థాయి శిక్షణ, స్పష్టమైన ప్రభుత్వ ఉత్తర్వులు, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ సమస్యలను పరిష్కరించిన తర్వాతే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు.
-
ఏపీ, తెలంగాణలో జనగణన - ఇవ్వాల్సిన వివరాలు, మార్గదర్శకాలు..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
ఏపీలో ఏకీకృత పెన్షన్ పథకం మార్గదర్శకాలు జారీ..! ఈ ఉద్యోగులకు..! -
End of Naxalism : ఆంధ్రప్రదేశ్‌లో ముగిసిన ఎర్రజెండా శకం.. -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
ఇంటర్ మూల్యాంకనం పూర్తి, ఫలితాల డేట్ ఫిక్స్ - ఏపీ.. తెలంగాణలో ఇలా..!! -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..!












Click it and Unblock the Notifications