వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వందేభారత్ ఎక్స్‌ప్రెస్ పై ఎందుకింత ఆర్భాటం; సామాన్యులకు అందుబాటులో లేదు; విమర్శల వెల్లువ!!

|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాల మధ్య ప్రారంభమైన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఇప్పుడు కేంద్రంలోని అధికార బిజెపికి, ప్రతిపక్ష పార్టీలకు మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. ఇప్పటికే వందే భారత్ రైలు పట్టాలెక్కిన సందర్భాన్ని పురస్కరించుకొని ఖమ్మంలో తెలంగాణ రాష్ట్రంలోని అధికారి బీఆర్ఎస్, బిజెపి నేతల మధ్య ఖమ్మం రైల్వే స్టేషన్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎవరికి వారు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు తీసుకువచ్చిన ఘనత తమ పార్టీదేనని చెప్పుకునే ప్రయత్నం చేశారు.

సామాన్యులకు అందుబాటులో లేని రైలు

సామాన్యులకు అందుబాటులో లేని రైలు

మరోపక్క ఈ రైలుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి తీవ్ర అసహనం వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా మాజీ మంత్రి, మాజీ టిపిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వందే భారత్ రైలు గురించి చేసిన ప్రచారం పై విమర్శలు గుప్పించారు. సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వరకు కొత్తగా ప్రవేశపెట్టబడిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు సామాన్యులకు అందుబాటులో లేదని ఆయన విమర్శలు గుప్పించారు. పండగపూట రాజకీయాలను మాట్లాడకూడదు అనుకున్నా కానీ పండగ రోజే రాజకీయాల గురించి మాట్లాడాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు.

వందే భారత్ రైలు ఏదో మొదటిసారిగా ప్రారంభిస్తున్నట్లు ఆర్భాటాలు

వందే భారత్ రైలు ఏదో మొదటిసారిగా ప్రారంభిస్తున్నట్లు ఆర్భాటాలు

సాక్షాత్తు ప్రధానమంత్రి, కేంద్రమంత్రి, గవర్నరు అందరూ ఒక రైలుకు సంబంధించిన అంశం మీద విస్తృత ప్రచారం చేశారన్నారు. వందే భారత్ రైలును సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలను కొనసాగింపుగా ప్రధానమంత్రి వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారని పేర్కొన్న మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య ప్రయాణికులని సికింద్రాబాద్ నుండి వైజాగ్ పంపించడానికి వందే భారత్ రైలు ఏదో మొదటిసారిగా ప్రారంభిస్తున్నట్లు ప్రధాని, మంత్రులు, గవర్నర్ ఆర్భాటాలు చేశారని అసహనం వ్యక్తం చేశారు.

ఇది మొదటి రైలు కాదు.. కానీ కొత్త పేర్లు , కొత్త నినాదాలు , ప్రచారాలు , ప్రారంభోత్సవాలు

ఇది మొదటి రైలు కాదు.. కానీ కొత్త పేర్లు , కొత్త నినాదాలు , ప్రచారాలు , ప్రారంభోత్సవాలు

ఇది మొదటి ట్రైన్ కాదు కదా ? ఇప్పటికే 17 ట్రైన్స్ ఉన్నాయి ఇది 18వ ట్రైన్.. 18వ ట్రైన్ ప్రారంభానికి ఇంత ఆర్భాటాలు ప్రచారాలు ఎందుకో చెప్పాలి ? అంటూ మండిపడ్డారు. ప్రజల సమస్యలను పరిష్కరించటానికి అవసరమైన కార్యక్రమాల మీద దృష్టి పెట్టకుండా కొత్త పేర్లు , కొత్త నినాదాలు , ప్రచారాలు , ప్రారంభోత్సవాలు చేస్తున్నారన్నారు. ఇది సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉన్న ట్రైన్ కాదు కదా అంటూ ఆయన పేర్కొన్నారు.

విభజన చట్టంలోని హామీలు ఒక్కటైనా నెరవేర్చారా?

విభజన చట్టంలోని హామీలు ఒక్కటైనా నెరవేర్చారా?

రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత పార్లమెంటు సాక్షిగా విభజన చట్టంలోని అంశాలు 8 సంవత్సరాలలో ఏ ఒక్కటి అయినా నెరవేర్చారా ? అని పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. విభజన చట్టంలోని అంశాలు మీ ప్రభుత్వం ఉండి కూడా అమలు చేస్తున్నారా? అమలు చేస్తున్నామని చెప్పే ధైర్యం మీకుందా... అంటూ పొన్నాల లక్ష్మయ్య నిలదీశారు. ఈ పర్వదినాన రెండు రాష్ట్రాల ప్రజలకు మేము ఇది చేస్తున్నాము అని చెప్పుకుంటే ఎంత బాగుండేది అన్న పొన్నాల లక్ష్మయ్య అలా చెప్పుకోవడానికి కేంద్రం వద్ద ఏమీ లేవని అభిప్రాయం వ్యక్తం చేశారు.

జెండా ఊపి ట్రైన్ ప్రారంభించడమా మోడీ చేసేది

జెండా ఊపి ట్రైన్ ప్రారంభించడమా మోడీ చేసేది


మీరు దక్షిణాదికి, తెలుగు రాష్ట్రాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. తాను రాజకీయ కోణంలో విభజించడానికి ఈ మాటలు చెప్పడం లేదన్నారు. వందే భారత్ లో ఏం చేసావ్ అయ్యా మోడీ ఒక జెండా ఊపి ట్రైన్ ప్రారంభించడమా... అంటూ ఎద్దేవా చేశారు.మిమ్మల్ని ప్రజలు దేవుడు క్షమించడు అని పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. వందే భారత్ రైలు కేవలం ధనికులకు మాత్రమే ఉపయోగపడే రైలు అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏదో మేలు చేస్తున్నాడు అన్నట్టు నటించే మోడీ , బిజెపి కి గుణపాఠం చెప్పాలన్నారు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య.

English summary
Former Minister Ponnala Lakshmaiah criticized that why there is so much publicity about Vande Bharat Express, it is not accessible to common people and it is not the first one.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X