పెద్దలను ఎదిరించి పెళ్ళి: 2 నెలలకే ఆత్మహత్య, ఎందుకంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

రోహ్‌తక్: పెద్దలను ఎదిరించి ప్రేమించి పెళ్లాడారు.పెళ్ళై రెండు మాసాలు కూడ కాలేదు. కానీ, నవ దంపతులు ఆత్మహత్య చేసుకొన్నారు. అయితే తమ ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ ఆ దంపతులు సూసైడ్ నోట్ రాశారు.

పెద్దలను ఎదిరించి పారిపోయి పెళ్ళి చేసుకొని కొంతకాలానికి ఇంటికి తిరిగి వచ్చే దంపతుల గురించి చూసే ఉంటాం, ఆ తరహ ఘటనలను వినే ఉంటాం. అయితే అదే తరహ ఘటన ఒకటి హర్యా నా రాష్ట్రంలో చోటు చేసుకొంది.సందీప్ కుమార్, రుచి ప్రేమించి పెళ్ళి చేసుకొన్న కొంత కాలానికే మరణించారు.

పెద్దలను ఎదిరించి వివాహం కూడ చేసుకొన్నారు. కానీ, ఆ దంపతులు ఎందుకు ఆత్మహత్య చేసుకొన్నారనే విషయమై మిస్టరీగానే ఉందని కుటుంబ సభ్యులు అంటున్నారు.

పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్ళి

పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్ళి

హర్యానా రాష్ట్రంలోని సోనిపట్ పట్టణానికి చెందిన సందీప్ కుమార్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేసేవాడు.డిగ్రీ చదువుతున్న రుచి అనే అమ్మాయిని ప్రేమించాడు. వీరి ప్రేమను వీరి కుటంబసభ్యులు, పెద్దలు వ్యతిరేకించారు. పెద్దలు వ్యతిరేకించినా వివాహం చేసుకోవాలని ప్రేమికులు నిర్ణయం తీసుకొన్నారు.

కోర్టు అనుమతితో వివాహం

కోర్టు అనుమతితో వివాహం

రెండు కుటుంబాలకు చెందిన పెద్దలు వ్యతిరేకించినా వీరిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా సందీప్, రుచిలు ఢిల్లీ కోర్టును ఆశ్రయించి రెండు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ వేరు కాపురం కూడ పెట్టారు.

కుటుంబసభ్యులు ఒప్పుకోలేదని

కుటుంబసభ్యులు ఒప్పుకోలేదని

తమ పెళ్లి కుటుంబ సభ్యులకు ఇష్టం లేనందు వల్ల తాము ఒకరిని విడిచి మరొకరు ఉండలేమని భావించి తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసి నవ దంపతులైన సందీప్, రుచిలు ఆత్మహత్య చేసుకున్నారు.కుటుంబసభ్యులు తమ ప్రేమను అంగీకరిస్తే ఇద్దరి ప్రాణాలు దక్కేవని స్థానికులు అంటున్నారు.

తల్లిదండ్రులకు సమాచారమిచ్చి

తల్లిదండ్రులకు సమాచారమిచ్చి

వివాహం చేసుకొన్న తర్వాత సందీప్, రుచిలు వేరుగా ఉంటున్నారు. అయితే కుటుంబసభ్యులు తమ వివాహనికి ఒప్పుకోనందుకు గాను మాట్లాడుకొందాం అంటూ సందీప్ తన కుటుంబసభ్యులకు సమాచారాన్ని పంపాడు. సందీప్ కుటుంబసభ్యులు సందీప్ వద్దకు వచ్చే సరికి గదిలో ఇద్దరు ఉరేసుకని ఆత్మహత్య చేసుకొన్నారు.
తమ ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని చెపుతూ తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నందుకు తమను క్షమించాలని సూసైడ్ నోట్ లో రాశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A young couple committed suicide by hanging at a flat in Suncity township here today. The deceased were identified as Sandeep of Sonepat district and Ruchi of Vishal Nagar in Rohtak.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X