హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు రాజీనామా చేస్తేనే రానివ్వాలి: జగన్ టార్గెట్ టిడిపి

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan targets TDP
హైదరాబాద్: సమైక్యాంధ్ర కోసం ఐక్యకార్యాచరణ సమితి చేపడుతున్న కార్యక్రమాలలో పాల్గొనాలంటే రాజీనామాలు చేసి రావాలని తెలుగుదేశం పార్టీ వారిపై ఒత్తిడి తేవాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయనను శనివారం ఎపి పరిరక్షణ సమితి, న్యాయవాదుల ఐకాస కలిసినప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవడం లేదని, రాజీనామా చేయడం లేదని, ప్రజలు, ఐకాస ఒత్తిడి పెరుగుతుండటంతో ఆ పార్టీ నేతలు రాజీనామాలు ఇస్తున్నారన్నారు.

వారి రాజీనామాలు స్పీకర్ ఫార్మాట్లో ఉన్నాయో లేదో ఎవరికీ తెలియదన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టవద్దని ఐకాస నేతలు కేంద్రానికి లేఖ రాస్తే తాను తొలి సంతకం చేస్తానని చెప్పారు. ఓట్లు, సీట్ల కోసం విభజన ఆపకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. చంద్రబాబు రాజీనామా చేస్తేనే సమైక్యాంధ్ర జెఏసిలోకి రానివ్వాలని జగన్ సూచించారు.

కాగా, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సమైక్యాంధ్ర జెఎసి లేఖ రాస్తే దానిపై తొలి సంతకం తానే పెడుతానని జగన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. అందరి ఆమోదం లేకుండా కేంద్రం రాష్ట్రాన్ని విభజిస్తోందని, దాన్ని అడ్డుకోవాలని ఆయన అన్నారు.

రాష్ట్ర విభజనను నిరసిస్తూ ప్రజలు రోడెక్కినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. కేవలం ఓట్లు, సీట్ల కోసమే తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు కలిసి రాష్ట్రాన్ని విభజిస్తున్నాయని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే పది జిల్లాలో తన్నుకునే పరిస్థితి వస్తుందని, న్యాయం చేయలేనప్పుడు కొట్టుకునే పరిస్థితి వస్తుందని జగన్ సమైక్యాంధ్ర న్యాయవాదులను ఉద్దేశించి ప్రసంగిస్తూ అన్నారు.

రెండు రాష్ట్రాలుగా విడిగొడితే నీళ్లు ఎలా ఇస్తారని ఆయన అడిగారు. నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాలకు నీళ్లు ఎలా వస్తాయని ఆయన అన్నారు. కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు మంచి నీళ్లు ఎవరు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. చదువుకున్న ప్రతి కుర్రాడు హైదరాబాద్ వైపే చూస్తున్నాడని, రాష్ట్రం ఆదాయంలో సగం హైదరాబాద్ నుంచే వస్తోందని, అదే ఆగిపోతే జీతాలు ఎలా ఇస్తారని ఆయన అన్నారు.

పంపకాల్లో తండ్రి పిల్లలకు న్యాయం చేయాలని, న్యాయం చేయలేనప్పుడు యధావిధిగా వదిలేయాలని ఆయన అన్నారు. సిపిఎం, మజ్లీస్, వైయస్సార్ కాంగ్రెసు సమైక్యాంధ్ర కోరుతున్నాయని ఆయన అన్నారు. మిగిలిన పార్టీలు కూడా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆయన అన్నారు.

English summary

 Speaking to Unified Andhra layers, YSR Congress party president YS Jagan clarified that he stood for the undivided AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X