వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కల్యాణ్‌కు ఎసరు: చంద్రబాబుతోనే జగన్ ముఖాముఖి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఎన్నికల వేడిని రగిలించారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని ఆలోచించకుండా బరిలోకి దిగడం వెనక జగన్ వ్యూహం ఏమై ఉంటుందనే విషయంపై చర్చ సాగుతోంది.

వచ్చే ఎన్నికల్లో విజయం సాధించకపోతే ఆయన తట్టాబుట్టా సర్దుకోవాల్సి ఉంటుంది. అందుకే వచ్చే ఎన్నికలను ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకుని వ్యూహరచన కోసం ప్రశాంత్ కిశోర్‌ను నియోగించుకున్నారు. తన కార్యాచరణను కూడా ప్రకటించారు.

దాదాపు నవ సూత్ర పథకాన్ని కూడా ఆయన వెల్లడించారు. దాదాపుగా దాన్ని ఎన్నికల ప్రణాళిక అని చెప్పుకోవాల్సి ఉంటుంది. గతంలోచేసిన తప్పిదాలను తిరిగి చేయకుండానే కాకుండా తనకు ఎన్నికలు సమీపిస్తే ఎదురయ్యే సవాళ్లను కూడా ఆయన ఇప్పుడే అధిగమించాలని అనుకుంటున్నారు.

పవన్ కల్యాణ్‌ ఇమేజ్‌కు ఎసరు....

పవన్ కల్యాణ్‌ ఇమేజ్‌కు ఎసరు....

పవన్ కల్యాణ్ పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి రాక ముందే జగన్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారని చెప్పవచ్చు. పవన్ కల్యాణ్ దిగితే తన బలం అటు వైపు మళ్లే అవకాశం కూడా లేకపోలేదు. పవన్ కల్యాణ్ రంగం మీదికి వచ్చిన తర్వాత తాను వేగం పెంచినా ఫలితం ఉండకపోవచ్చుననేది ఆయన అంచనా కావచ్చు. అంతేకాకుండా పవన్ కల్యాణ్ వస్తే సమీకరణాలు మారిపోవచ్చు. ఆ సమీకరణాలు మారకుండా ముందే తన బలాన్ని, బలగాన్ని సుస్థిరపరుచుకోవాలనేది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది.

Recommended Video

Venkaiah Naidu praises Roja
చంద్రబాబుతో ముఖాముఖి....

చంద్రబాబుతో ముఖాముఖి....

పవన్ కల్యాణ్‌ను నామమాత్రంం చేస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడితో ముఖాముఖి తలపడడానికి వీలవుతుంది. బలాలు మూడు వైపులా చీలిపోకుండా ఎదురెదురు మాత్రమే నిలబడి తలపడుతాయి. చంద్రబాబుకు తాను మాత్రమే పోటీ ఇవ్వగలననే నమ్మకాన్ని కలిగించడం కూడా ముందుగానే సమరరంగంలోకి ఆయన దూకినట్లు భావించవచ్చు.

మరో వైపు చూడకుండా...

మరో వైపు చూడకుండా...

తాను జాప్యం చేస్తే క్యాడర్, ద్వితీయ శ్రేణి నాయకత్వం మరో మార్గం చూసుకోవచ్చు. పవన్ కల్యాణ్ సిద్ధపడితే అవి జనసేన పార్టీకి అండగా నిలిచే అవకాశం లేకపోలేదు. అందువల్ల ముందుగానే యుద్ధరంగంలోకి దిగితే క్యాడర్‌‌కు, ద్వితీ శ్రేణి నాయకత్వానికి విశ్వాసం కల్పించడానికి వీలవుతుందనేది ఆయన అంచనాగా చెప్పవచ్చు.

పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్

కేవలం ఇమేజ్ మీద, తన అభిమానుల మీద ఆధారపడి ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు. తన పోరాట పటిమ మీద, తన ఆదర్శాల మీద నెట్టుకురావాలని చూస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఆయన జగన్ పట్ల ఏ విధమైన వైఖరి తీసుకుంటారనేది కూడా ముఖ్యమే అవుతుంది. చంద్రబాబుపై దూకుడుగా వ్యవహరిస్తారా లేదా అేనేది కూడా ప్రధామే. దాన్ని దృష్టిలో ఉంచుకుని పవన్ కల్యాణ్ స్పష్టమైన వైఖరితో రంగంలోకి దిగకముందే తాను ఇది అని చెప్పుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు.

English summary
According to political analysts - YSR Congress president YS Jagan is trying to undermine Jana Sena chief Pawan Kalyanin Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X