పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. త్వరలో తగ్గనున్న ధరలు?
బంగారం ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. నేడు (జనవరి 14, 2026) 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర(24 క్యారెట్లు) రూ. 1,43,425 కు చేరుకుంది. కేవలం గత 10 రోజుల్లోనే సుమారు రూ. 6,000 వరకు పెరగడం కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే కొన్ని నెలల్లో బంగారం ధరలు తగ్గుతాయా? లేదా మరింత పెరుగుతాయా? అనే అంశంపై నిపుణుల విశ్లేషణ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందా?
మార్కెట్ నిపుణులు వచ్చే కొన్ని నెలలకు సంబంధించి రెండు రకాల అంచనాలను వేస్తున్నారు. గత కొన్ని నెలలుగా పసిడి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి, మార్చి నెలల మధ్య కాలం 10 శాతం నుంచి 15 శాతం వరకు ధరలు తగ్గే అవకాశం ఉందని కొందరు నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరిగినా లేదా అమెరికా వాణిజ్య ఆంక్షల్లో ఏవైనా మార్పులు వచ్చినా బంగారం ధరలు తాత్కాలికంగా కిందకు రావచ్చు.

దీర్ఘకాలంలో పెరగనున్న ధరలు
జేపీ మోర్గాన్, గోల్డ్‌మన్ సాచ్స్ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల ప్రకారం.. ధరల్లో వచ్చే ఏ చిన్న తగ్గుదల అయినా అది తాత్కాలికమే. 2026 చివరి నాటికి బంగారం ధర రూ.1.50 లక్షల నుంచి రూ. 1.60 లక్షల వరకు చేరుకోవచ్చని అంచనా. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి, వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని నిల్వ చేసుకోవడం వల్ల ధరలు దీర్ఘకాలంలో పెరుగుతూనే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
బంగారం కొనుగోలుదారులకు నిపుణుల సలహాలు
బడ్జెట్ 2026 కోసం వేచి చూడండి: ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం బంగారంపై కస్టమ్ డ్యూటీ (దిగుమతి సుంకం) తగ్గించే అవకాశం ఉంది. ఒకవేళ సుంకం 2శాతం తగ్గినా, ధరలు తక్షణమే రూ. 2,000 నుండి రూ. 3,000 వరకు తగ్గే అవకాశం ఉంటుంది. మరోవైపు ఒకేసారి భారీ మొత్తంలో బంగారం కొనకుండా, ధర తగ్గిన ప్రతిసారీ కొంచెం కొంచెం కొనడం ఉత్తమం. పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఫిబ్రవరి బడ్జెట్ తర్వాత మార్కెట్ సరళిని గమనించి నిర్ణయం తీసుకోవడం మంచిది.
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!!












Click it and Unblock the Notifications