10 నిమిషాల ఛార్జింగ్.. 300 కి.మీ ప్రయాణం! మెర్సిడెస్ వేగన్ కార్ వేగానికి మైండ్ బ్లాకే!
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ప్రపంచంలోనే మొట్టమొదటి 'ప్యూర్ వేగన్' (Pure Vegan) ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. అమెరికాలోని లాస్ వెగాస్‌లో జరిగిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో (CES 2026)లో తన పాపులర్ మోడల్ GLC ఎలక్ట్రిక్ వెర్షన్‌ను ప్రదర్శించింది. ఈ కారు పర్యావరణ ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తోంది.
ప్రపంచంలోనే తొలి 'వేగన్' ఇంటీరియర్
సాధారణంగా లగ్జరీ కార్ల సీట్లు, డ్యాష్‌బోర్డ్ తయారీలో జంతువుల చర్మాన్ని (లెదర్) ఉపయోగిస్తారు. కానీ ఈ కారు ఇంటీరియర్‌లో ఎక్కడా జంతువుల ఉత్పత్తులను వాడలేదు. సీట్లు, స్టీరింగ్ వీల్, కార్పెట్లు అన్నీ 'వేగన్' మెటీరియల్‌తో రూపొందించబడ్డాయి. వేగన్ సొసైటీతో కలిసి మెర్సిడెస్ సుమారు 2 ఏళ్ల పాటు పరిశోధన చేసి, 100కు పైగా భాగాలను యానిమల్-ఫ్రీగా తయారు చేసింది. ఏ భాగాన్ని కూడా జంతువులపై పరీక్షించలేదు. కారు ఇంటీరియర్‌లో ఎక్కువగా రీసైకిల్ చేసే పదార్థాలను వాడారు.

అద్భుతమైన పర్ఫార్మెన్స్, రేంజ్
ఈ కారు కేవలం పర్యావరణానికే కాదు, వేగానికి కూడా పెట్టింది పేరు. దీని ఎలక్ట్రిక్ ఇంజన్ 483 hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. గంటకు 210 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 713 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. 330 kW ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో కేవలం 10 నిమిషాల్లో 300 కి.మీ ప్రయాణానికి సరిపడా ఛార్జింగ్ చేసుకోవచ్చు.
అత్యాధునిక టెక్నాలజీ
డ్యాష్‌బోర్డ్ మొత్తం విస్తరించి ఉండే 39.1 అంగుళాల భారీ స్క్రీన్ దీని ప్రత్యేకత. మైక్రోసాఫ్ట్, గూగుల్ AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)లు రెండూ కలిసి పనిచేసే ప్రపంచంలోనే తొలి కారు ఇది. ఇందులో లెవల్ 2 ఆటోమేటెడ్ సిస్టమ్ ఉంది. పార్కింగ్ నుండి డ్రైవింగ్ వరకు ఒక్క క్లిక్‌తో కారు తనంతట తానుగా వెళ్లగలదు.
అమ్మకాలు ఎప్పుడు?
అమెరికాలో 2026 రెండో త్రైమాసికం (ఏప్రిల్-జూన్) నుండి ఈ కారు అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. వినియోగదారులు కంపెనీ వెబ్సైట్లోకి వెళ్లి తమకు నచ్చిన విధంగా 'వేగన్' ఇంటీరియర్‌ను స్వయంగా కస్టమైజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications