వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారీగా పడిపోయిన రూపాయి విలువ, పెరిగిన డాలర్

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ భారీగా పడిపోతోంది ఏడాదిలో ఎప్పుడూ లేనంతగా రూపాయి విలువ పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ సోమవారం నాడు 67.13 వద్ద ట్రేడైంది. ఇది 2107 ఫిబ్రవరి నాటి అత్యంత కనిష్టస్థాయి కావడం గమనార్హం.

అమెరికా డాలర్‌ విలువ బలపడుతుండటం, అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరగడం రూపాయి విలువను దెబ్బతీస్తున్నాయని ఫారెక్స్‌ అడ్వయిజరీ సంస్థ ఐఎఫ్‌ఏ గ్లోబల్‌ తెలిపింది. శుక్రవారం రోజు కూడా రూపాయి విలువ 66.86గా నమోదైంది. మరోవైపు డాలర్‌ విలువ డిసెంబర్‌ నాటి గరిష్ట స్థాయిలను బద్దలు కొడుతోంది. ఆరు మేజకర్‌ కరెన్సీలతో పోలిస్తే డాలర్‌ విలువ, డాలర్‌ ఇండెక్స్‌లో 92.609కు పెరిగింది.

అంతేకాక అంతర్జాతీయ క్రూడ్‌ ఆయిల్‌ ధరలు మూడేళ్లలో అ‍త్యంత గరిష్ట స్థాయిలను తాకుతున్నాయి. గ్లోబల్‌గా సరఫరా చాలా కఠినతరంగా ఉండటంతో ఈ పరిస్థితి నెలకొంది. అమెరికా-ఇరాన్‌ మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఆందోళనలతో ఆయిల్‌ ధరలు బ్యారల్‌కు 75 డాలర్ల పైగా నమోదవుతున్నాయి.ఇది కూడ రూపాయి విలువ పడిపోవడానికి కారణంగా మారింది.

Rupee falls to lowest level in more than a year against US dollar

మరోవైపు దేశీయంగా కర్నాటక ఎన్నికల ప్రభావం కూడా రూపాయిపై పడుతోంది. మే 12వ తేదిన కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే మే 15 వ తేదిన ఫలితాలు వస్తాయి. ఈ ఎన్నికల ప్రభావం కూడ రూపాయిపై పడుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 66.73 నుంచి 67.10 మధ్యలో ట్రేడవనుందని ఫారెక్స్‌ అడ్వయిజరీ సంస్థ తెలిపింది. ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి విలువ 67.085 వద్ద నమోదైంది. ప్రస్తుతం 67.13 వద్ద ట్రేడవుతోంది.

English summary
The rupee weakened beyond the 67-to-the-dollar mark on Monday on risk aversion as oil rose above $75 a barrel and amid geo-political tensions related to United States and Iran.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X