హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరదనీటిపై చార్మినార్.. అచ్చం తాజ్‌మహల్ మాదిరిగానే.. వరదల నేపథ్యంలో..

|
Google Oneindia TeluguNews

వర్షాల వల్ల హైదరాబాద్ అస్తవ్యస్తంగా మారింది. వరదనీటితో జనం ఇక్కట్లు పడుతున్నారు. వారికి సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. అయితే హైదరాబాద్ అంటే గుర్తొచ్చొది తొలుత చార్మినార్.. ఆ చార్మినార్ ప్రతిబింబం వరదనీటిపై కనిపిస్తోంది. అలా ఒకరు తీసిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది ఆ ఫోటో తెగ వైరలవుతోంది.

 Charminar view in flood water

హైదరాబాద్ అంటే బిర్యానీ, చార్మినార్.. భాగ్యనగరానికి ఈ రెండే కేరాఫ్ అడ్రస్. పర్యాటకులు చార్మినార్ తప్పక వీక్షించాల్సిందే. అయితే గత ఐదారురోజుల నుంచి హైదరాబాద్‌లో వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు, గ్రౌండ్ ప్లోర్ దాదాపు నిండిపోయాయి. హైదరాబాదీలు తెగ ఇబ్బంది పడుతున్నారు. మరో రెండురోజులు బయటకు రావొద్దని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. అయితే ఈ క్రమంలో వరదనీటిపై చార్మినార్ ప్రతిబింబం అబ్బురపరుస్తోంది. ఎవరో ఔత్సాహికుడు తీసిన చిత్రం.. నెటిజన్ల మనసు దోచేసింది.

Recommended Video

#HyderabadFloods-Helpline Numbers:TS Gov Declared 2 Days Holidays | Oneindia Telugu

ఇలానే తాజ్ మహల్ వద్ద కూడా ఉంటుంది. తాజ్ మహల్ ముందు గల యుమునా నదీ ప్రతిబింబం కనిపిస్తోంది. దీనిని చూసిన జనం సంబర పడిపోతుంటారు. కానీ చార్మినార్ వద్ద అలాంటి ఏర్పాట్లు లేకున్నా.. వర్షంతో అలాంటి సిచుయేషన్ కలిగింది. వర్షంతో జనం ఇక్కట్లు పడుతోన్నా.. ఈ ఫోటో మాత్రం కాస్త స్వాంతన చేకూరుస్తోంది. హైదరాబాద్‌లో ఇలాంటి ఫోటోలా అని జనం ఒకింత ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి వర్షపునీటిపై చార్మినార్ ప్రతిబింబం ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటుందనడంలో ఎలాంటి సందేహాం లేదు. ఇదో కొత్త అనుభూతి అని పలువురు చెబుతున్నారు.

English summary
Charminar view in flood water in hyderabad old city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X