హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘పుష్ప’ను కాపీ చేశారు.. సిటీలో పట్టుబడ్డ శాండల్స్.. వ్యాల్యూ రూ.60 లక్షలు..

|
Google Oneindia TeluguNews

ఎర్రచందనం.. సుగంద ద్రవ్యం. కాస్ల్టీ కూడా. చిత్తూరు జిల్లా అడవీలో విస్తారంగా ఉంటాయి. ధర ఎక్కువ పలుకడంతో కొందరు అక్రమ రవాణా చేస్తారు. చేసి సొమ్ము చేసుకుంటారు. దొరకనంత వరకు ఓకే.. దొరికితేనే దొంగలు.. ఏపీలో ముఖ్యంగా చిత్తూరు.. ఆ పరిసరాల్లో దొరికితే ఓకే.. కానీ కొందరు వాటిని హైదరాబాద్ వరకు తీసుకొచ్చారు. అయితే వారు 'పుష్ప' మూవీ మాదిరిగా తెలివి ప్రదర్శించారు. ఎర్రచందనం దుంగలపై అరటి పండ్లు, అరటి ఆకులను వేశారు. పోలీసులకు అనుమానం వచ్చి తీసి చూడగా కనిపించింది.

పుష్ప మూవీ మాదిరిగా..

పుష్ప మూవీ మాదిరిగా..

పుష్ప సినిమాలో మాదిరిగా ఎర్రచందనం తరలిస్తోన్న స్మగ్లింగ్ ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. ఎల్బీనగర్ పరిధిలో శుక్రవారం పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. అరటి పండ్ల లోడుతో వెళ్తున్న వాహనాన్ని తనిఖీ చేశారు. ఎర్రచందనం పైకి కనబడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పైన అరటి పండ్లను పెట్టారు. దానితోపాటు అరటి ఆకులను కూడా కప్పారు. పోలీసుల అనుమానం నిజమైంది. తీసి చూడగా ఎర్రచందనం దుంగల కనిపించాయి.

రూ.60 లక్షలు

రూ.60 లక్షలు

షేక్ మహమ్మద్ రఫీ, ముల్లా బషీర్ అహమ్మద్‌ను ఎల్బీనగర్ ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. మరొ నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా ఎర్రచందనాన్ని ముఠా సభ్యులు తరలించారు. వారి నుంచి 31 ఎర్రచందనం దుంగలను, మూడు మోబైల్స్, రూ.1600 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందన విలువ రూ.60 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.

ఎలా తీసుకొచ్చారు..

ఎలా తీసుకొచ్చారు..

ఆంధ్ర సరిహద్దు నుంచి హైదరాబాద్ వరకు దాదాపు 200 కిలోమీటర్ల పరిధిలో ఎర్ర చందనం దుంగలు ఎలా తీసుకువచ్చారో అర్థం కావడం లేదు. జిల్లాకు ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. మరీ వీరిని ఎవరూ ఆపలేరా..? లేదంటే ఎలా తప్పించుకున్నారనే అంశంపై క్లారిటీ లేదు. అదీ హైదరాబాద్ నడిబొడ్డున దొరకడం కలకలం రేపుతుంది. లేదంటే మధ్యలో వారు సిబ్బందిని మేనేజ్ చేశారా అనే సందేహాలు కలుగుతున్నాయి. కానీ నిందితులు మాత్రం పుష్ప మూవీని కాపీ కొట్టారు.. కానీ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు.

English summary
red sandal smugglers caught at lb nagar area. police recovered 31 logs and 3 mobiles, rs 1600 cash
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X