చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం పదవిలో ఉండి తుది శ్వాస విడచారు: ఆ 16మంది వీరే

మన దేశంలో ముఖ్యమంత్రి పదవిలో ఉండి తనువు చాలించిన ముఖ్యమంత్రుల సంఖ్య 16కు చేరుకుంది. సోమవారం రాత్రి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/చెన్నై: మన దేశంలో ముఖ్యమంత్రి పదవిలో ఉండి తనువు చాలించిన ముఖ్యమంత్రుల సంఖ్య 16కు చేరుకుంది. సోమవారం రాత్రి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మరణంతో ఈ సంఖ్య 15 నుంచి 16కు చేరుకుంది.

1

గోపీనాథ్ బర్డోలొయ్(మృతి: అస్సాం, ఆగస్టు 6, 1950)

ఏప్రిల్ 1946 వరకు ( అస్సాం విభజనకు ముందు సీఎం పదవిని ప్రధానమంత్రిగా సంభోదించేవారు) ఆ తర్వాత ఆగస్టు 1950 నుంచి సీఎం సంబోధించడం ప్రారంభించారు. ఆయన సీఎంగా ఉన్న కాలంలోనే కన్నుమూశారు.

2

రవిశంకర్ శుక్లా(మధ్యప్రదేశ్, 1956, డిసెంబర్ 31న మృతి)

ఏప్రిల్ 1946-50 వరకు(ప్రీమియర్ ఆఫ్ ది సెంట్రల్ ప్రావిన్స్ అండ్ బేరర్) అని సీఎం పదవిని సంభోధించేవారు. ఆ తర్వాత జనవరి 1950 నుంచి సీఎంగా సంబోధించడం ప్రారంభమైంది. 1956 వరకు సీఎంగా కొనసాగిన శుక్లా.. పదవిలో ఉండగానే డిసెంబర్ 31న ప్రాణాలు వదిలారు.

3

శ్రీకృష్ణ సింగ్(బీహార్, 1961, జనవరి 31న మృతి)

బీహార్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా శ్రీకృష్ణ సింగ్ 1946లో బాధ్యతలు చేపట్టారు.

4

బిధన్ చంద్ర రాయ్(మృతి: పశ్చిమబెంగాల్, జులై1, 1962)

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా 1948-52, మార్చి 1952-57, మే 1957-జులై 1962 వరకూ మూడుసార్లు ఆయన ముఖ్యమంత్రిగా పని చేశారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండగానే జులై 1, 1962లో మృతి చెందారు.

5

మరోట్రావు కన్నమ్వార్(మృతి: మహారాష్ట్ర, నవంబర్ 24, 1963)

నవంబర్ 1962 నుంచి నవంబర్ 1963 వరకు కొనసాగిన ఆయన పదవిలు ఉండగానే మరణించారు.

6

సీఎన్ అన్నాదురై(మృతి: తమిళనాడు, ఫిబ్రవరి 3, 1969)

ఫిబ్రవరి 1967 నుంచి ఫిబ్రవరి 1969 వరకు సీఎంగా కొనసాగిన ఆయన.. పదవిలో ఉన్న సమయంలోనే కన్నుమూశారు.

7

దయానంద్ బందోడ్కర్(మృతి: గోవా, ఆగస్టు 12, 1973)

డిసెంబర్ 1963 నుంచి డిసెంబర్ 1966 వరకు(గోవా ముఖ్యమంత్రి, డామన్ అండ్ డయ్యూ టెరిటోరీ), ఏప్రిల్ 1967 నుంచి మార్చి 1972 వరకు రెండోసారి, మార్చి 1972 నుంచి ఆగస్టు 1973 మూడోసారి ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆగస్టు 12, 1973లో సీఎంగా కొనసాగుతున్న సమయంలోనే ఆయన మృతి చెందారు.

8.

బర్కతుల్లా కాన్(రాజస్థాన్, మృతి: అక్టోబర్ 11, 1973)

జులై 1971 నుంచి అక్టోబర్ 1973 వరకు ఈయన రాజస్థాన్ సీఎంగా కొనసాగుతున్న సమయంలోనే అక్టోబర్ 11, 1973లో మరణించారు.

9

షేక్ అబ్దుల్లా(జమ్మూకాశ్మీర్, మృతి: సెప్టెంబర్ 8, 1982)

మార్చి 1948 నుంచి ఆగస్టు 1953 వరకు(జమ్మూకాశ్మీర్ ప్రధానిగా), ఫిబ్రవరి 1975 నుంచి మార్చి 1977 వరకు సీఎంగా తొలిసారి, జులై 1977 నుంచి సెప్టెంబర్ 1982 రెండోసారి కూడా ముఖ్యమంత్రిగా కొనసాగారు.

10

ఎంజీ రామచంద్రన్(తమిళనాడు, మృతి: డిసెంబర్ 24, 1987)

జూన్ 1977 నుంచి జూన్ 1980 వరకు తొలిసారి, 1980 నుంచి 1984 వరకు రెండోసారి, 1985 నుంచి 1987వరకు మూడోసారి సీఎం కొనసాగారు.

11

చిమన్ భాయి పటేల్(గుజరాత్, మృతి: ఫిబ్రవరి 17, 1994)

జులై 1973 నుంచి ఫిబ్రవరి 1974 వరకు తొలిసారి, మార్చి 1990 నుంచి ఫిబ్రవరి 1994 వరకు రెండోసారి సీఎంగా కొనసాగారు.

12

బియాంత్ సింగ్(పంజాబ్, మృతి ఆగస్టు 31, 1995)

ఫిబ్రవరి 1992 నుంచి డిసెంబర్ 31, 1995 వరకు సీఎంగా కొనసాగారు.

13

వైయస్ రాజశేఖర్ రెడ్డి(ఆంధ్రప్రదేశ్, మృతి: సెప్టెంబర్ 2, 2009)

2004 నుంచి 2009 తొలిసారి, మే 2009 నుంచి సెప్టెంబర్ 2009 వరకు రెండోసారి సీఎంగా కొనసాగారు. ఈయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.

14

దోర్జీ ఖండూ(అరుణాచల్ప్రదేశ్, మృతి: ఏప్రిల్ 30, 2011)

ఏపిల్రల్ 2007 నుంచి ఏప్రిల్ 2011 వరకు సీఎంగా కొనసాగారు.

15

ముఫ్తీ మహ్మద్ సయీద్(జమ్మూకాశ్మీర్, మృతి: జనవరి 7, 2016)

యేడాది జనవరి 7న ఉయదం జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్.. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించారు. డిసెంబర్ 24న శ్రీనగర్ నుంచి ఆయనను ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. కాగా, అక్కడే చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.

16

జయలలిత(తమిళనాడు, మృతి: డిసెంబర్ 5, 2016)

వరుసగా రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన జయలలిత అనారోగ్యం కారణంగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందారు.

English summary
As many as 16 Indian Chief Ministers have died while still in office, three of whom were from Tamil Nadu, including Jayalalithaa, who passed away late on Monday night. Jayalalithaa's political mentor MG Ramachandran had also passed away while in office in 1987.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X