రైతుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తం, కాల్పుల్లో నలుగురు రైతులు మృతి, పోలీసుల రివర్స్ గేర్
మధ్యప్రదేశ్‌లో రైతులు కొనసాగిస్తున్న ఆందోళన తీవ్ర ఉద్రిక్తంగా మారింది. రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో వారిని అదుపు చేసేందుకు సీఆర్పీఎఫ్ పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మొత్తం నలుగు
భోపాల్: మధ్యప్రదేశ్‌లో రైతులు కొనసాగిస్తున్న ఆందోళన తీవ్ర ఉద్రిక్తంగా మారింది. రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో వారిని అదుపు చేసేందుకు సీఆర్పీఎఫ్ పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక రైతు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
పోలీసుల కాల్పుల్లో మరికొందరు రైతులు తీవ్రంగా గాయపడగా వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరో ముగ్గరు రైతులు మృతిచెందడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

అయితే అక్కడి పోలీసు అధికారులు మాత్రం ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు కాల్పులు జరపలేదని, గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో కాల్పులు జరిపారని, తాము ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని చెబుతున్నారు.
మరోవైపు రైతుల ఆందోళన కారణంగా ఎటువంటి వదంతులు వ్యాపించకుండా మాండ్ సౌర్ సహా పలు ప్రాంతాల్లో అంతర్జాల సేవలు నిలిపివేశారు. రైతులు కూడా వెనక్కి తగ్గకుండా రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు.
గిట్టుబాటు ధర కల్పించాలని, తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మధ్యప్రదేశ్‌లో కొన్ని రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇటీవలే ఆ రాష్ట్రంలో రైతులకు, పోలీసులకు మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొని, చల్లబడింది. మళ్లీ మంగళవారం తాజాగా ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications