షాకింగ్: నాలుగున్నరేళ్ల బాలుడు.. ‘ఆ’ పని చేశాడా?
ఇదొక దిగ్భ్రాంతికర ఘటన. దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూసింది. రోజూ మనం నేరాలు, ఘోరాలకు సంబంధించి ఎన్నో వార్తలు వింటుంటాం కానీ ఇలాంటి వార్త మాత్రం ఇప్పటి వరకు వినుండం.
ఢిల్లీ: ఇదొక దిగ్భ్రాంతికర ఘటన. దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూసింది. రోజూ మనం నేరాలు, ఘోరాలకు సంబంధించి ఎన్నో వార్తలు వింటుంటాం కానీ ఇలాంటి వార్త మాత్రం ఇప్పటి వరకు వినుండం.
కొన్ని విపరీత పోకడలు చిన్నారులపై ఏ స్థాయిలో ప్రభావాన్ని చూపిస్తున్నాయో చెబుతూ ప్రమాద ఘంటికలను మోగిస్తున్న ఘటన ఇది. ఢిల్లీలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న తన సహ విద్యార్థినిపై లైంగిక చర్యకు పాల్పడ్డాడనే ఆరోపణలపై ఓ నాలుగున్నరేళ్ల బాలుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

గత శుక్రవారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వచ్చిన ఆ విద్యార్థిని తన ఒళ్లంతా నొప్పులుగా ఉందని తల్లితో చెప్పింది. దీన్ని ఆమె మొదట పెద్దగా పట్టించుకోలేదు. అదే రోజు రాత్రి ఆ విద్యార్థిని ఏడుస్తూ తల్లి వద్దకు వచ్చి క్లాస్ రూంలో ఓ విద్యార్థి తన పట్ల ప్రవర్తించిన తీరును వివరించడంతో అవాక్కయిన బాధితురాలి తల్లిదండ్రులు చిన్నారిని ఆస్పత్రికి తరలించారు.
ఆ చిన్నారిని పరీక్షించిన ఆసుపత్రి వైద్యులు ఆమె లైంగిక వేధింపులకు గురైందనేది గుర్తించడంతో చివరికి ఆ చిన్నారి తల్లిదండ్రులు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.అతి సున్నితమైన కేసు కావడంతో న్యాయ నిపుణులను సంప్రదించినట్లు డిప్యూటీ కమిషనర్ తెలిపారు. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.












Click it and Unblock the Notifications