జీఎస్టీ పూర్తి వివరాలు: ఏయే శ్లాబుల్లో ఏయే వస్తువులు.. ట్యాక్స్ ఫ్రీ వస్తువులేవి?

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: జులై 1నుంచి దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమలులోకి రానున్న సంగతి తెలిసిందే. కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వస్తు సేవల పన్ను(జీఎస్టీ) పలు రంగాలపై గణనీయంగా ప్రభావం చూపుతోంది. ఈ ప్రభావంతో పలు వస్తువులు పూర్తి ట్యాక్స్ ఫ్రీగా మార్కెట్లో లభ్యం కానున్నాయి.

జీఎస్టీ అమలు తర్వాత.. చికెన్, గుడ్లు, పాలు, తాజా మాంసం, పాలు, పెరుగు, సహజంగా దొరికే తేనే, తాజా కూరగాయలు, పండ్లు, ఉప్పు, బ్రెడ్, సిందూర్,స్టాంపు, జ్యుడిషియల్ పేపర్స్, ప్రచురించిన పుస్తకాలు, వార్తా పత్రికలు, చేనేత వస్త్రాలు, గాజులు, ప్యాకింగ్ చేయని పన్నీర్, వెజిటెబుల్ ఆయిల్స్, గర్భనిరోధక వస్తువులు వంటివి పన్ను మినహాయింపులో చేరున్నాయి.

12శాతం పన్ను వీటిపై:

12శాతం పన్ను వీటిపై:

నిల్వ ఉంచిన మాంసం ఉత్పత్తులు, వెన్న, జున్ను, నెయ్యి, ప్యాకేజీగా వచ్చే డ్రై ఫ్రూట్స్, సాసేజ్, పండ్ల రసాలు, భుటియా, నామ్కిన్(చిప్స్ లాంటివి), ఆయుర్వేదిక్ మెడిసిన్, టూత్ పౌడర్, అగర్ బత్తి, రంగుల పుస్తకాలు, బొమ్మల పుస్తకాలు, గొడుగు, కుట్టు మిషన్లు, సెల్ ఫోన్లు వంటివి 12శాతం శ్లాబ్ లోకి రానున్నాయి.

5శాతం పన్ను వీటిపై:

5శాతం పన్ను వీటిపై:

క్రీమ్, బ్రాండెడ్ పన్నీర్, కాఫీ, టీ, స్పైసీస్, పిజ్జా, బ్రెడ్, రస్క్, సగ్గుబియ్యం, కిరోసిన్, కోల్, స్టెంట్, లైఫ్ బోట్స్, ఫిష్ వంటి వాటిపై 5శాతం మేర పన్ను అమలవనుంది.

18శాతం పన్ను పరిధిలోకి వచ్చేవి:

18శాతం పన్ను పరిధిలోకి వచ్చేవి:

షుగర్, పాస్తా, కార్న్ ఫ్లేక్స్, రొట్టెలు, కేక్స్, జామ్స్, సాసులు, సూప్స్, ఐస్ క్రీమ్స్, ఇన్ స్టాంట్ ఫుడ్ మిక్సెస్, మినరల్ వాటర్, టిష్యూలు, ఎన్వలప్స్, టాంపోన్స్, నోట్ బుక్స్, స్టీల్ ప్రొడక్ట్స్, ప్రింటెడ్ సర్క్యూట్, కెమెరా, స్పీకర్స్, మానిటర్స్.

28శాతం పన్ను అమలయ్యే వస్తువులు:

28శాతం పన్ను అమలయ్యే వస్తువులు:

చూయింగ్ గమ్, మొలాసిస్, కోకా లేని చాకోలెట్లు, వాఫెల్స్, పాన్ మసాలా, పెయింట్, పర్ ఫ్యూమ్, షేవింగ్ క్రీమ్స్, హెయిర్ షాంపు, డై, సన్ స్క్రీన్, వాల్ పేపర్, పింగాణి పాత్రలు, వాటర్ హీటర్, డిష్ వాషర్, బరువు కొలిచే యంత్రాలు, వాషింగ్ మెషిన్, ఏటీఎంలు, ఆటోమొబైల్స్, మోటార్ సైకిల్స్, వ్యక్తిగత అవసరాలకు వాడే ఎయిర్ క్రాఫ్ట్ వంటి వస్తువులు 28శాతం పన్ను పరిధిలోకి రానున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Goods and Services Tax (GST) has been one of the key things that has caught the attention of the market given its implications on earnings of companies
Please Wait while comments are loading...