వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రక్షించడంటూ విద్యార్థి ఆర్తనాదాలు, రికార్డు చేశారిలా..చివరికిలా..

రోడ్డు ప్రమాదంలో గాయపడి రక్షించండంటూ చేసిన ఆర్తనాదాలను పట్టించుకోకుండా స్థానికులు ఈ ప్రమాదదృశ్యాలను రికార్డు చేసేందుకు పోటీపడ్డారు. దీంతో అన్వర్ అనే విధ్యార్థి చనిపోయాడు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు:టెక్నాలజీ పెరిగింది. మనిషిని బతికించేందుకు టెక్నాలజీని ఉపయోగించుకొంటున్నాం. కాని,మానవత్వాన్ని మర్చిపోతున్నాం. ప్రాణాపాయస్థితిలో ఉన్న వారిని కాపాడే ప్రయత్నం చేయడం లేదు. కాపాడండి అంటూ కేకలు వేస్తోన్న ఆ దృశ్యాలను సెల్ ఫోన్లను రికార్డు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాం. ఇదే తరహ ఘటన మరోకటి కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకొంది.

కర్ణాటక రాష్ట్రంలోని కొప్పళ్ళ పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వైద్య విధ్యార్థి చనిపోయారు.రక్షించండి అంటూ ఆ విధ్యార్థి చేసిన ఆర్తనాదాలను పట్టించుకోలేదు. ఈ దృశ్యాలను మాత్రం తమ సెల్ ఫోన్లను చిత్రీకరించడంలో మునిగిపోయారు స్థానికులు.

a student died in road accident in karnataka

కొప్పళ్ళ పట్టణంలో కూరగాయల మార్కెట్ కు బుదవారం నాడు ఉదయం అన్వర్ అనే విధ్యార్థి సైకిల్ పై వెళ్తున్నాడు.అతడిని ఈశాన్య రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ బస్సు డీకొట్టింది.

అతడి నడుం పై నుండి బస్సు చక్రాలు వెళ్ళాయి. దీంతో ఆయనుకు తీవ్ర రక్తస్రావమైంది. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతానికి కూతవేటు దూరంలోనే ఎస్ పి కార్యాలయం, జిల్లా ఆసుపత్రి ఉంది.

అయితే అన్వర్ ను ఆసుపత్రికి తీసుకెళ్ళేందుకు ఎవరూ కూడ పట్టించుకోలేదు. కాని, ఈ ప్రమాద దృశ్యాలను తమ సెల్ ఫోన్లను రికార్డుచేసేందుకుగాను పోటీపడ్డారు.

మాయమైపోతున్నాడమ్మా...మనిషన్నవాడు. మచ్చుకైనా లేడు చూడ మానవత్వం ఉన్నవాడు అంటూ అందెశ్రీ రాసిన పాట ఈ ఘటనను చూస్తే గుర్తుకువస్తోంది. దాదాపు 20 నిమిషాలపాటు అన్వర్ రక్తపు మడుగులోనే రోడ్డుపై రక్షించండి అంటూ ఆర్తనాదాలు చేశాడు.

అయితే ఎట్టకేలకు ఆయనను ఆసుపత్రికి చేర్చారు.అయితే ఆసుపత్రిలో చేర్చిన తర్వాత ఆయన చికిత్స పొందుతూ మరణించాడు. తీవ్ర రక్తస్రావం వల్లే ఆయన మరణించాడని వైద్యులు చెబుతున్నారు.

ప్రజలునిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే అన్వర్ మరణించాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అన్వర్ రక్షించడంటూ చేసిన ఆర్తనాదాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇదే రాష్ట్రంలో ఇటీవలే మహేష్ కుమార్ అనే ఇన్స్ పెక్టర్ కూడ ఇదే రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. హరీష్ సాంత్వన పేరుతో ప్రభుత్వం పథకాన్ని ప్రవేశపెట్టినా ఈ పథకం ఆశించిన మేరకు ఉపయోగపడడం లేదనే విమర్శలున్నాయి.

English summary
a student died in road accident in karnataka.anwar died in road accident at koppal town on wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X