వారికి ఆధార్-మొబైల్ లింకింగ్‌ను సులభం చేయనున్న కేంద్రం

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఆధార్ - సిమ్ లింకింగ్ విషయంలో వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ దృష్ట్యా కేంద్రం వయోవృద్ధులకు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తోంది.

ఆధార్‌ను అనుసంధానించాలంటే ప్రస్తుతం ఆయా టెలికాం సెంటర్ల సేవా కేంద్రాలకు వెళ్లి నమోదు చేయించుకోవాలి. అయితే వృద్ధులు వెళ్లడానికి ఇబ్బందులుపడుతున్నారు.

Aadhaar-mobile linking to be made easy for senior citizens

వారు కేంద్రాలకు వెళ్లకుండానే కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ పలు ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. ఈదిశగా టెలికాం సంస్థలతో సంప్రదింపులు జరిపింది.

ప్రాథమికంగా ఇవి వృద్ధులకే అయినప్పటికీ గ్రామీణ, కొండ ప్రాంతాలతో పాటు చిన్న చిన్న పట్టణాల్లో నివసించేవారికి టెలికాం సేవాకేంద్రాలు అందుబాటులో ఉండటం లేదు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రత్యామ్నాయాలను ఇతరులకూ వర్తింపజేసే అవకాశముందని అంటున్నారు.

కేంద్రం వీటిని పరిశీలిస్తోంది

ఇంటర్నెట్లో ఏటీపీ ద్వారా యూఐడీఏఐతో నమోదు చేసుకోవడం, అయితే ఆధార్‌ నమోదు సమయంలోనే ఆ సెల్ ఫోన్ సంఖ్యను ఇస్తేనే ఈ ప్రక్రియ మరింత సులువు అవుతుంది.

వృద్ధుల వద్దకు టెలికాం సంస్థలు తమ ప్రతినిధులను పంపించి ఆధార్‌ నమోదు చేయించడం, బయోమెట్రిక్‌ వివరాలను తీసుకోవడం. వృద్ధులెవరైనా బయటకు కదల్లేని స్థితిలో ఉంటే అలాంటి వారు తమ కుటుంబంలో ఒకరిని తమ ప్రతినిధిగా ఏర్పాటు చేసుకుని ఆధార్‌ అనుసంధానికి పంపించడం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a bid to bring relief to senior citizens, who have difficulty linking their mobile numbers with Aadhaar, government is exploring a string of measures including introducing iris scanning in place of fingerprints and conducting home visits for senior citizens to make the entire process hassle free.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి