డాక్టర్ల పీపీఈ కిట్లపై రాందేవ్ స్లోగన్లు -బ్లాక్ డే నిరసనల్లో యోగా బాబా అరెస్టుకు డిమాండ్, కేంద్రం మౌనం
కరోనా వార్డుల్లో డ్యూటీలు చేస్తోన్న డాక్టర్లందరూ ఇవాళ తాము ధరించిన పీపీఈ కిట్లపై యోగా గురు బాబా రాందేవ్ పేరును రాసుకున్నారు. అదేదో యోగా టిప్స్ కోసమో, లేక పంతంజలి ఉత్పత్తుల ప్రమోషన్ కోసమో, కాదంటే మోదీ సర్కార్ సూచించిన 'పాజిటివిటీ' వ్యాప్తి కోసమో కాదు. అచ్చంగా రాందేవ్ అరెస్టు కోసమే డాకర్టు నేడు నిరసనలు చేపట్టారు. అందులో భాగంగా కొందరు డాక్టర్లు రోడ్డెక్కితే, డ్యూటీలో ఉన్నవాళ్లు మాత్రం ఇలా తమకు తోచిన రీతిలో నిరసనలో పాలుపంచుకున్నారు..
కరోనాకు అల్లోపతి వైద్యవిదానం పనికిరాదని, అసలు అల్లోపతినే పనికిమాలిన సైన్స్ అని, వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా వేల మంది డాక్టర్లు చనిపోయారని, అందుకే తాను టీకాలు తీసుకోవడంలేదని, 98 శాతం జబ్బుల్ని నయం చేసే శక్తి ఒక్క ఆయుర్వేదానికి మాత్రమే ఉందంటూ రాందేవ్ బాబా చేసిన కామెంట్లు పెనువివాదానికి దారితీయడం తెలిసిందే. రూ.1000కోట్ల పరువునష్టం దావా, కేంద్రానికి, ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు తర్వాత కూడా రాందేవ్ ఎంతకీ తగ్గకపోవడం, అరెస్టు చేసే దమ్ము ఎవడికీ లేదంటూ ఆయన సవాలు విరసడంతో అనివార్యంగానే డాక్టర్లు రోడ్లెక్కారు..

ఆధునిక వైద్యం, కొవిడ్ వ్యాక్సిన్లపై యోగా గురువు బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా డాక్టర్లు ఇవాళ(మంగళవారం) బ్లాక్ డేను పాటిస్తున్నారు. దేశం నలుమూల ఆసుపత్రులలోని వైద్య సిబ్బంది ప్రదర్శనలు నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకొని పతంజలి ఆయుర్వేద్ వ్యవస్థాపకుడిని అరెస్టు చేయాలని నినాదాలు చేశారు.

తన వ్యాఖ్యలకు రాందేవ్ తక్షణమే బహిరంగంగా బేషరతుగా క్షమాపాణలు చెప్పాలని, లేదా ప్రభుత్వాలు వెంటనే అతణ్ని అరెస్టు చేయాలని డాక్టర్లు డిమాండ్ చేశారు. ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్స్ (ఫోర్డా) జూన్ 1 బ్లాక్ డేకు పిలుపునివ్వగా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) వారికి సంఘీభావంగా నిరసనల్లోనూ పాలుపంచుకుంది.

అసలే వ్యాక్సిన్ల సమర్థతపై దేశంలో అనుమానాలుండటం, చాలా మంది లేనిపోని అపోహలతో వ్యాక్సినేషన్ ప్రక్రియకు దూరంగా ఉంటోన్న క్రమంలో యోగా గురు రాందేవ్ వ్యాఖ్యలు టీకాల ప్రచారానికి వ్యతిరేకంగా ఉన్నాయని, ఎపిడమిక్ చట్టాల ప్రకారం ఆయనపై దేశద్రోహం కేసు పెట్టాలని ఎంఐఏ ఇదివరకే డిమాండ్ చేసింది.

కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో డాక్టర్లు నేరుగా రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నాయి. అయినాసరే కేంద్రం ఇప్పటికీ మౌనంగానే ఉంటుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆక్సిజన్, మందుల కోరతపై ప్రశ్నించినవాళ్లను జైళ్లలోకి నెడుతోన్న బీజేపీ.. రాందేవ్ లాంటివాళ్లను మాత్రం వెనకేసుకురావడం దారుణమని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications