నవంబర్ కంటే ముందు బ్యాంకు ఖాతాలను కూడ చూపండి

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూడిల్లీ : పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత బిజెపి ప్రజా ప్రతినిధులు తమ బ్యాంకు లావాదేవీలను బహిరంగ పర్చాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన సూచనపై ఆప్ అధినేత డిల్లీ ముఖ్యమంత్రి ఘాటుగానే స్పందించారు. నవంబర్ 8వ, తేది ముందు రోజు కూడ వారి ఖాతాల వివరాలను కూడ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

పెద్ద నగదు నోట్ల రద్దు వ్యవహారం బిజెపి ఎంపిలకు ముందే తెలుసునని బిజెపి పై డిల్లీ ముఖ్యమంత్రి విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలకు సమాధానంగా బిజెపి తమ పార్టీ ప్రజా ప్రతినిధులందరూ తమ ఖాతాల వివరాలను వెల్లడించాలని కోరింది.నవంబర్ 8వ, తేది నుండి డిసెబబర్ 1వ, తేదివరకు ఎంపిల ఖాతాల లావాదేవీలను వెల్లడించాలని అమిత్ షా ఆదేశించారు.

before sixmonths account details release

నవంబర్ 8వ, తేది తర్వాత ఖాతా వివరాలు కాదు, అంతకు ఆరు మాసాల ముందు ఖాతా వివరాలను వెల్లడించాలని అరవింద్ కేజ్రీవాల్ కోరారు.ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. పెద్ద నగదు నోట్ల రద్దు వ్యవహారం మోడీ మిత్రులకు ముందే తెలుసునని ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు.జూలై నుండి సెప్టెంబర్ వరకు బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో నగదు చేరుకొందని ఆయన చెప్పారు.

బ్యాంకుల్లో జమ చేసిన నగదు ఇప్పటివరకు 8 కోట్లు ఉందని, ఈ నగదులో చిల్లిగవ్వ కూడ బ్లాక్ మనీ లేదన్నారు ఆయన. కరెన్సీ రద్దు ప్రయోగం విఫలమైందని ఆయన చెప్పారు.పెద్ద నగదు నోట్ల రద్దు విషయాన్ని ముందుగానే తన స్నేహితులకు చెప్పి మోడీ మేలు చేశారని ఆయన ఆరోపించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
before sixmonths on nov 8 acconts deatials relese,delhi cm aravind demand to bjp chief amitshah. bjp chief ordered to party mps, mlas after nov 8 to dec 1, transactions release to people. some friends of mode known about currency ban said aravind.
Please Wait while comments are loading...