రైల్లో అమ్మాయిని వేధించిన బీజేపీ ఎమ్మెల్సీ, అరెస్ట్
పాట్నా: రైలులో ప్రయాణిస్తున్న తనను లైంగికంగా వేధిస్తున్న ఓ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీని ఓ యువతి పట్టించిన సంఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది. గోరఖ్‌పూర్ వెళుతున్న ఓ రైలులోని ఏసీ కోచ్‌లో బాధిత యువతి ప్రయాణిస్తోంది.
అదే కోచ్‌లో బీజేపీ సివాన్ నియోజకవర్గ ఎమ్మెల్సీ టున్నా పాండే ప్రయాణిస్తున్నారు. కోచ్‌లో ఎవరూ లేకపోవడంతో తన పట్ల ఆయన అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని ఆమె రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

రైలు ప్రయాణిస్తున్న మార్గంలోని హజీపూర్ వద్ద బోగీలోకి వచ్చిన రైల్వే పోలీసులు టున్నా పాండేను అరెస్ట్ చేశారు. బీజేపీ కూడా ఆయన పైన వెంటనే చర్యలు తీసుకుంది. మైనర్ బాలికను వేధించినందున అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ నేత సంజయ్ మయుక్త్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications