పెళ్లికూతురు సాఫ్ట్వేర్ ఇంజనీర్.. తాళి కట్టిన 10 నిమిషాలకే అసలు ట్విస్ట్!
సాధారణంగా పెళ్లి వేడుక అంటే అందరూ సందడిగా గడుపుతారు. కానీ ఓ స్టార్టప్ వ్యవస్థాపకురాలు మాత్రం తన పెళ్లి ముగిసిన 10 నిమిషాలకే ల్యాప్‌టాప్ పట్టుకుని కూర్చున్నారు. కంపెనీలో తలెత్తిన ఓ కీలకమైన సాఫ్ట్వేర్ సమస్యను(క్రిటికల్ బగ్) పరిష్కరించేందుకు ఆమె పెళ్లి దుస్తుల్లోనే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
అసలేం జరిగిందంటే?
KoyalAI అనే స్టార్టప్ సీఈఓ మెహుల్ అగర్వాల్, తన సోదరి, కో-ఫౌండర్ అయిన గౌరీ అగర్వాల్‌కు సంబంధించిన ఒక ఫోటోను ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేశారు. ఎర్రటి పెళ్లి దుస్తులు, ఒంటి నిండా నగలతో ఉన్న గౌరీ పెళ్లి వేదికపైనే ల్యాప్‌టాప్ ముందు కూర్చుని సీరియస్‌గా పని చేస్తూ ఆ ఫోటోలో కనిపించారు.

మెహుల్ తన పోస్ట్‌లో ఇలా రాశారు..
"స్టార్టప్ జీవితం అంటే అందరూ చాలా గ్లామరస్‌గా ఉంటుందని ఊహించుకుంటారు, కానీ అందులో చాలా కష్టం ఉంటుంది. నా సోదరి గౌరీ తన పెళ్లి ముగిసిన కేవలం 10 నిమిషాలకే ఒక క్రిటికల్ బగ్‌ను ఫిక్స్ చేస్తోంది. ఇది ఫోటోల కోసం చేసిన పని కాదు.. ఆ సమయంలో పని చేస్తున్నందుకు మా తల్లిదండ్రులు మా ఇద్దరిపై గట్టిగా అరిచారు కూడా." అంటూ రాసుకొచ్చారు. అంతేకాకుండా, గౌరీ తన హనీమూన్‌లో ఉన్నప్పుడు కూడా రోజుకు 3 గంటల పాటు మీటింగ్స్‌లో పాల్గొంటోందని, దీనివల్ల ఆమె భర్త అసంతృప్తిగా ఉన్నారని మెహుల్ సరదాగా మరో పోస్ట్‌లో పేర్కొన్నారు.
People romanticize startups but it is a lot of work.
— Mehul Agarwal (@meh_agarwal) December 16, 2025
This is my sister & co-founder @gauri_al at her own wedding, 10 minutes after ceremony, fixing a critical bug at @KoyalAI.
Not a photo op, parents yelled at both of us.
When people ask why we won, I'll point to this. pic.twitter.com/ee3wTEYwXG
నెట్టింట మిశ్రమ స్పందన
ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి చర్చిస్తున్నారు. కొందరు ఆమె అంకితభావాన్ని మెచ్చుకుంటున్నారు. "విజయం ఊరికే రాదు, ఇలాంటి కష్టం ఉంటేనే సాధ్యం" అని కొనియాడుతున్నారు. మరికొందరు ఇది "టాక్సిక్ వర్క్ కల్చర్" అని విమర్శిస్తున్నారు. "జీవితంలో అతి ముఖ్యమైన క్షణాలను కూడా పని కోసం త్యాగం చేయడం సరికాదు" అని హితవు పలుకుతున్నారు. "ఇది పని పట్ల గౌరవం కాదు, టైమ్ మేనేజ్మెంట్, టీమ్ మేనేజ్మెంట్లో వైఫల్యం" అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. స్టార్టప్ ప్రపంచంలో ఉండే పని ఒత్తిడిని ఈ ఘటన ప్రతిబింబిస్తోంది. అయితే పనికి, వ్యక్తిగత జీవితానికి మధ్య సమతుల్యత అవసరమని ఈ వైరల్ పోస్ట్ మరోసారి గుర్తు చేస్తోంది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications