వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్ఏడీతో కలిసి బరిలోకి: అధికారం పక్కా.. ఇదీ మాయావతి లెక్క

|
Google Oneindia TeluguNews

పంజాబ్ ఎన్నికలపై ఎవరి లెక్కలు వారివి. విజయం కోసం ఆయా పార్టీలు అంచనా వేసుకుంటున్నాయి. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, శిరోమణి అకాళిదల్ మధ్య పోటీ ఉండనుంది. మధ్యలో ఆప్ కూడా గట్టిగానే ట్రై చేస్తోంది. అయితే పోరులో తాము కూడా ఉన్నామని బీఎస్పీ అంటోంది. అంతేకాదు ఉమ్మడిగా పోటీ చేస్తామని చెప్పారు. తమ కూటమి అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

అధికారం పక్కా..

అధికారం పక్కా..

శిరోమణి అకాలీదళ్ పార్టీతో కలిసి ఫుల్ మెజార్టీతో అధికారంలోకి వస్తామని బీఎస్పీ అధినేత్రి మాయావతి ధీమా వ్యక్తం చేశారు. అకాలీదళ్ 100వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ దేశానికి కేవలం కొన్ని పార్టీలు మాత్రమే సుదీర్ఘకాలం పాటు సేవలందించాయని చెప్పారు. పంజాబ్ ప్రజల కోసం సుదీర్ఘ కాలం పాటు సేవలందించిన ప్రాంతీయ పార్టీ శిరోమణి అకాలీదళ్ అని గుర్తుచేశారు. సుఖ్ బీర్ సింగ్ బాదల్ నాయకత్వంలో తమ కూటమి పంజాబ్‌లో ఘన విజయం సాధిస్తుందని చెప్పారు.

ఎన్నికల స్టంట్

ఎన్నికల స్టంట్

ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం, సగం పూర్తైన ప్రాజక్టులను ప్రారంభించడం వంటివి చేస్తున్నారని మాయావతి ఆరోపించారు. ఇవి బీజేపీకి ఏమాత్రం లాభించవని ఆమె అన్నారు. వారణాసిలో కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టును మోడీ ప్రారంభించిన నేపథ్యంలో ఆమె ఈ కామెంట్స్ చేశారు. మరోవైపు సమాజ్ వాదీ పార్టీపై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. ఇతర పార్టీలు బహిష్కరించిన నేతలను చేర్చుకోవడం వల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదని అన్నారు.

చేరికలు

చేరికలు

బీజేపీకి చెందిన ఎమ్మెల్యే దిగ్విజయ్ నారాయణ్ చౌబే, బీఎస్పీకి చెందిన ఎమ్మెల్యే వినయ్ శంకర్ తివారీ, మాజీ ఎంపీ కౌశల్ అదివారం సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలోనే మాయా ఆ విధంగా కామెంట్స్ చేశారు. కానీ బీజేపీ అంటే మాయావతి అంటిముట్టనట్టుగానే ఉంటారు. మరీ ఎస్ఏడీతో ఎలా పొత్తు కొనసాగిస్తారో అర్థం కావడం లేదు. శిరోమణి అకాళిదల్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి. వీరితో మాయవతి ఎలా కలిసి పనిచేస్తారో అర్థం కావడం లేదు. ఈ కామెంట్స్‌ను బట్టి.. మాయావతి ఆ కూటమిలో భాగస్వాములు అవుతారని అర్థం అవుతుంది.

English summary
bsp will contest in punjab assemly elections. sad along contest bsp chief mayawathi said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X