మూడేళ్లక్రితం చనిపోయిన అధికారిని బదలీ చేశారు

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: మహారాష్ట్రలో ట్రాన్సుఫర్‌లో విచిత్రం చోటు చేసుకుంది. చనిపోయిన ఓ ఎక్సైజ్ అధికారిని ట్రాన్సుఫర్ చేశారు. చనిపోయిన వ్యక్తిని ట్రాన్సుఫర్ చేసిన అంసంలో మహారాష్ట్ర ప్రభుత్వం క్లర్క్ పైన చర్యలు తీసుకుంది. అతనిని సస్పెండ్ చేసింది.

మూడేళ్ల క్రితం మృతి చెందిన ఎక్సైజ్ శాఖ సబ్ ఇన్‌స్పెక్టర్‌కు తాజాగా, బదిలీ అయినట్లు ఆర్డర్స్‌ వచ్చాయి. ఆ ఆర్డర్స్ ప్రకారం అతనిని కొల్హాపూర్‌ నుంచి నాసిక్‌కు బదిలీ చేశారు. ఈ పొరపాటు అక్కడి క్లర్స్ వల్ల జరిగింది.

Clerk suspended for dead officer's transfer

సందీప్‌ సబాలే అనే ఎక్సైజ్‌ ఎస్సై 2013లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇటీవల, జులై 7వ తేదీన ఎక్సైజ్‌ శాఖలో బదిలీ అయిన 181 మంది ఎస్సైలలో సందీప్‌ పేరు కూడా ఉండటం గమనార్హం.

కార్యాలయంలోని క్లర్క్‌ సందీప్‌ మరణించిన విషయాన్ని నమోదు చేయకపోవడంతో కొల్హాపూర్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కూడా బదిలీ ఆర్డర్‌ ఇచ్చారు. విషయం తెలియడంతో క్లర్క్‌ను మంగళవారం రాత్రి సస్పెండ్ చేయడంతో పాటు సూపరింటెండెట్‌కు వివరణ ఇవ్వాల్సిందిగా షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The State government on Tuesday night suspended a clerk in Kolhapur Superintendent of Excise office after Congress leader Narayan Rane highlighted how it had transferred an excise sub-inspector dead in July 2013, from Kolhapur to an excise flying squad in Satana, Nashik, earlier this month.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X