ఫోన్ రిసీవ్ చెయ్యలేదని ప్రభుత్వ మహిళా ఉద్యోగిపై దాడి: వేడుకుంటున్నా (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

బళ్లారి/బెంగళూరు: ఫోన్ కాల్ వస్తే రిసీవ్ చెయ్యలేదని ఆరోపిస్తూ ఓ మహిళా అధికారి మీద సాటి ఉద్యోగి దాడి చేసిన ఘటన కర్ణాటకలోని రాయచూరు జిల్లా, సింధనూరు పట్టణంలో జరిగింది. సింధనూరు నగరసభ (మునిసిపాలిటి)లో ఎస్ డీఏ అధికారిగా పని చేస్తున్న నస్రినా అనే మహిళ మీద దాడి జరిగింది.

కర్ణాటక బంద్: బెంగళూరు తుస్, ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు బస్సులు, అంతేనా !

అదే కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న తాత్కాలిక ఉద్యోగి (కాంట్రాక్ట్) శరణప్పను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈనెల 10వ తేదీ సాయంత్రం 4.28 గంటల సమయంలో నగర సభ కార్యాలయంలో మహిళా అధికారిణి నస్రీనా, కంప్యూటర్ ఆపరేటర్ శరణప్ప ఉన్నారు.

ఫోన్ కాల్ వచ్చింది !

నస్రీనా టేబుల్ దగ్గర ఉన్న ల్యాండ్ లైన్ ఫోన్ కు అవతలి వ్యక్తులు ఫోన్ చేశారు. ఆ సందర్బంలో ఫోన్ తియ్యాలని శరణప్ప చెప్పాడు. అయితే నస్రీనా ఫోన్ రిసీవ్ చెయ్యలేదని తెలిసింది. అంతే శరణప్పకు కడుపు మండిపోయింది.

తప్పించుకోవాలని ప్రయత్నిస్తే !

తప్పించుకోవాలని ప్రయత్నిస్తే !

ఒక్క సారిగా శరణప్ప తన కుర్చీలో నుంచి లేచాడు. నేరుగా నస్రీనా సీటు దగ్గరకు జోరుగా వెళ్లాడు. ఆ సమయంలో దాడి చేస్తాడని భయపడిన నస్రీనా కుర్చీలో నుంచి లేచి దూరం వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే ఒక వైపు గొడ, మరోవైపు టేబుల్ ఉండంటో ఆమె తప్పించుకోవడానికి సాధ్యం కాలేదు.

బూటుకాలితో తన్నాడు !

బూటుకాలితో తన్నాడు !

అంతే రెచ్చిపోయిన శరణప్ప బూటుకాలితోనే నస్రీనాను ఎగిరి తన్నాడు. ఈ విషయం బయటకు చెవితే నీ అంతు చూస్తానని ఆమెను హెచ్చరించాడు. చివరికి అక్కడ ఉంటే మళ్లీ దాడి చేస్తాడని భయపడిన నస్రీనా తన వ్యానిటీ బ్యాగ్ తీసుకుని కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయారు.

సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది !

సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది !

నస్రీనా ఫిర్యాదు చెయ్యడంతో సింధనూరు పోలీసులు కేసు నమోదు చేసి శరణప్పను అదుపులోకి తీసుకున్నారు. శరణప్ప సాటి ఉద్యోగి నస్రీనా మీద దాడి చేస్తున్న సమయంలో అదే కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డు కావడంతో వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల చర్చలు !

పోలీసుల చర్చలు !

రంజాన్ పండుగ ఉపవాసాలు ఉంటున్న సమయంలో అదే వర్గానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి మీద సాటి ఉద్యోగి దాడి చెయ్యడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే శరణప్పను అదుపులోకి తీసుకున్నారు. ముందు జాగ్రత చర్యగా ఇరు వర్గాల పెద్దలతో పోలీసులు చర్చలు జరిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Raichur : Computer operator Kicked female staff in office in Karnataka.
Please Wait while comments are loading...