వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కండోమ్‌ల కొరత: సెక్స్ వర్కర్‌ల గురించి ఆందోళన

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: హెచ్ఐవీ వ్యాపించకుండా ఉండేందుకు ముందస్తు చర్యగా ప్రభుత్వం కండోమ్‌లు ఉచితంగా ఇస్తుంది. కానీ కర్నాటకలో ముఖ్యంగా రామనగర, ఉడిపి, హాసన్ జిల్లాల్లో కండోమ్‌ల కొరత తీవ్రంగా ఉందంటున్నారు. దాంతో ఆ ప్రాంతంలో హెచ్ఐవీ వ్యాప్తి ప్రమాదం ఎక్కువ ఉందని ఓ పరిశీలనలో తేలింది.

సగటున ఓ సెక్స్ వర్కర్‌కు 12 నుంచి 30 నిమిషాలకు ఓ కండోమ్ అందుబాటులో ఉండాలని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం నిర్దేశిస్తోంది. కర్నాటకలో సెక్స్ వర్కర్ల కోసం నెలకు దాదాపు 26 లక్షల నుంచి 30 లక్షల వరకు కండోమ్‌లు సరఫరా చేస్తోంది.

Condom scarcity spreads an AIDS scare in Karnataka, worries sex workers

కానీ డిసెంబర్ నెలకు అందుబాటులో ఉన్న స్టాకు దాదాపు ఏడు లక్షలు. కండోమ్‌ల కొరత తీవ్రంగా ఉందని సెక్స్ వర్కర్లకు కండోంలను సరఫరా చేసే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు చెబుతున్నారని అంటున్నారు. అయితే, కొరత ఉందనే దానిని పథకం ప్రాజెక్టు డైరెక్టర్ మాత్రం అంగీకరించడం లేదంటున్నారు.

హెచ్ఐవీ పాజిటివ్ వ్యక్తులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కర్నాటక ఒకటి. ఎనభై వేల మందికి పైగా సెక్స్ వర్కర్లు ఉన్నట్లు అంచనా. కండోమ్‌ల కొరత ఉంటే సెక్స్ వర్కర్ల జీవితాలపై ప్రభావం పడుతుందని ఎన్జీవో ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

English summary
A sex worker should be able to get a condom in 12-30 minutes, states one of the objectives of National Aids Control Programme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X