వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నగదు లేదని....ఎటిఎం కు అంత్యక్రియలు

పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా ప్రజల ఇబ్బందులు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. బ్యాంకులు, ఎటిఎం లపై ప్రజలు తమ నిరసనను వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై :పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా ప్రజల ఇబ్బందులకు ఇంకా తీరలేదు. కొత్త కరెన్సీ డిమాండ్ మేరకు ప్రజలకు అందుబాటులోకి రాలేదు. ఈ కారణంగా బ్యాంకులు, ఎటిఎంల వద్ద దేశ వ్యాప్తంగా ప్రజలు బారులు తీరుతున్నారు. అయితే ఎటిఎంలలో నగదు లేకపోవడంతో ప్రజలు వినూత్ప రీతిలో నిరసనను తెలుపుతున్నారు.

పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా బ్యాంకులు, ఎటిఎం ల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. ఎటిఎంలలో అవసరాలకు సరిపోను డబ్బురాకపోవడంతో తమకు తోచిన పద్దతుల్లో నిరసనలు తెలుపుతున్నారు.

cremation to atm centre in coimbatore

ఇటీవలనే ఓ పట్టణంలో ఎటిఎం కు సంతాపసభ నిర్వహించారు. ఈ ఘటనను మరువకముందే ఇదే తరహలోనే మరో ఘటన చోటుచేసుకొంది. ప్రజలకు అందుబాటులో డబ్బులు లేని కారణంగా తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు వాసులు వినూత్నరీతిలో నిరసనను తెలిపారు.

కోయంబత్తూరులోని ఎటిఎం సెంటర్ లో సరిపోయినన్నీ డబ్బులు రావడం లేదు..దీంతో అసహనానికి గురైన ప్రజలంతా ఎటిఎం డోర్ కు అంత్యక్రియలు నిర్వహించారు. మనిషి చనిపోయినప్పుడు ఏ రకంగా తమ దు:ఖాన్ని బయటపెట్టుకొంటారో అదే రీతిలో ఎటిఎం డోర్ వద్ద కూడ వెక్కి వెక్కి ఏడ్చారు. మనిషికి అంత్యక్రియలు నిర్వహంచినట్టుగానే అంత్యక్రియలు చేశారు.ఈ వీడియోను స్థానికులు సామాజిక మాథ్యమాల్లో పోస్టు చేశారు.ఈ వీడియో వైరల్ గా మారింది.

English summary
Coimbatore citizens protest against the bankers,they cremation to atm centre in Coimbatore .this atm centre not function proper.so people cremation atm centre door. this video post in social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X