ఫుడ్ బాగోలేదన్నందుకు కస్టమర్లపై వేడి నూనెను పోశాడు(వీడియో)

Subscribe to Oneindia Telugu

ముంబై: మహారాష్ట్ర రాజధానిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తమకు ఇచ్చిన ఆహారం బాగోలేదని వాగ్వాదానికి దిగిన కస్టమర్లపై ఓ చైనీస్ ఫుడ్ స్టాల్ యజమాని సలసల కాగుతున్న నూనెను పోశాడు. దీంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మహారాష్ట్రలోని ఉల్లాస్‌నగర్‌ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. విక్కీ మాస్కే తన ముగ్గురు స్నేహితులతో కలిసి వీనస్‌ చౌక్‌లోని మనోజ్‌ కోలివాడా చైనీస్‌ స్టాల్‌కు వెళ్లాడు. ఆర్డర్‌ ఇచ్చిన ఆహారం రుచికరంగా లేకపోవడంతో విక్కీ స్టాల్‌ యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అక్కడే ఉన్న కొన్ని వస్తువులను విక్కీ దుకాణం యజమానిపై విసిరేశాడు.

ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన స్టాల్‌ యజమాని.. విక్కీ, అతడి స్నేహితులపై బాణలిలో మరుగుతున్న నూనెను మగ్గుతో తీసుకొని వారి మీద పోశాడు. ఇలా రెండు మూడు సార్లు చేశాడు. దీంతో విక్కీ సోదరుడు దీపక్‌, అతడి స్నేహితుడు విజయ్‌ తీవ్రంగా గాయపడ్డారు. దీపక్‌ ముఖంపై వేడి నూనె పడింది. గాయపడిన వారిని వెంటనే ఉల్లాస్‌నగర్‌ సెంట్రల్‌ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. అయితే స్టాల్‌ యజమాని కూడా సదరు కస్టమర్లపై ఫిర్యాదు చేశాడు. ఫుడ్‌ బాగోకపోవడంతో విక్కీ అతడి స్నేహితులు స్టాల్‌లోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారని, తమ సిబ్బందితో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ స్టాల్‌ యజమాని కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Three Customers Attacked by a Hotel owner in Maharashtra.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి