2జి స్పెక్ట్రమ్ కేసు తీర్పు: అభియోగాలు వీగిపోయిన తీరు ఇదీ..

Posted By:
Subscribe to Oneindia Telugu
  2G Spectrum Case : 2జీ స్పెక్ట్రమ్‌ కేసు : ఒకపక్క హర్షం, మరో పక్క విమర్శలు !

  న్యూఢిల్లీ: 2జి స్పెక్ట్రమ్ కేసు సిబిఐ కోర్టులో వీగిపోయిన విషయం తెలిసిందే. డిఎంకె నేతలు ఎ. రాజా, కనిమొళి తదితరులపై కేసులు పెట్టి అభియోగాలు మోపారు. అయితే వారందరినీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

  కేసు తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. రాజకీయంగా కూడా తీవ్ర ప్రకంనలు సృష్టించింది. కోర్టు తీర్పుతో తమిళనాడులోని డిఎంకెకు భారీ ఊరట లభించింది. కేసు విషయంలో కోర్టు కూడా కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.

   ఆ సంస్థలకు అనుకూలంగా రాజా...

  ఆ సంస్థలకు అనుకూలంగా రాజా...

  రాజాకు 2004-07 కాలంలో పర్యావరణ మంత్రిగా ఉన్నప్పటి నుంచి డిబి గ్రూప్ అధికారులు సాహిద్ బల్వా, వినోద్ గోయెంకాలతో పరిచయం ఉంది. దాంతోుపి గ్రూప్ ప్రమోట్ చేసిన స్వాన్ టెలికం ప్రవైట్ లిమిటెడ్‌కు యుఎఎస్ లైసెన్సులు మంజూరు చేసే విషయంలో రాజా కుట్ర చేశారు. అందులో భాగంగానే అక్రమంగా డైనమిక్స్ రియాల్టీ నుంచి కలైంగర్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్‌క రూ.200 కోట్లు బదిలీ అయ్యాయి. బల్వా, గోయెంకా 20సార్లకు పైగా రాజాను కలిశారని ఆయన మాజీ ప్రైవేట్ కార్యదర్శి ఆశీర్వాదం ఆచారి చెప్పారు. ఇది కేసులో ఓ అభియోగం.

   కోర్టు దాన్ని ఇలా తోసిపుచ్చింది...

  కోర్టు దాన్ని ఇలా తోసిపుచ్చింది...

  రాజా కార్యాలయానికి బాల్వా, గోయెంకా వచ్చినట్లు ప్రాసిక్యూషన్ డాక్యుమెంటరీ రికార్డును సమర్పించలేకపోయిందని కోర్టు అభిప్రాయపడింది. ఆచారి మౌఖిక వాంగ్మూలాన్ని విశ్వసించాల్సిన అవసరం లేదని చెప్పింది.

  ముగ్గురు నిందితులు మంత్రిని కలిసినట్లు డాక్యుమెంటరీ రికార్డు సాక్ష్యం చూపించడానికి ప్రాసిక్యూషన్ ఒక్క అపాయింట్‌మెంట్ చార్ట్‌ను గానీ సందర్శకుల రిజిష్టర్ గానీ సేకరించలేపోయిందని కోర్టు అభిప్రాయపడింది. నిందితుల సమావేశానికి సంబంధించి దర్యాప్తు అధికారి మౌఖిక లేదా డాక్యుమెంటరీ సాక్ష్యం ఒక్కటి కూడా సేకరించలేకపోయిందని న్యాయమూర్తి ఓపి సైనీ అన్నారు.

  కలైంగర్ టీవికి లంచం ఇచ్చిన ఆరోపణ

  కలైంగర్ టీవికి లంచం ఇచ్చిన ఆరోపణ

  రాజాకు ఇవ్వజూపిన రూ.200 కోట్ల లంచాన్ని డిఎంకె అధినే ఎం. కరుణానిధి కుటుంబం నడుపుతున్న కలైంగర్ టీవీ ప్రైవేట్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్‌‌ ఖాతాలో జమ చేశారని సిబిఐ డిప్యూటీ పోలీసు సూపరింటిండెంట్ ఎస్కే సిన్హా కోర్టుకు చెప్పారు.

   ఆరోపణను తోసిపుచ్చిన కోర్టు...

  ఆరోపణను తోసిపుచ్చిన కోర్టు...

  డైనమిక్స్‌కు అనుకూలంగా వ్యవహరించినందుకు ఆ సంస్థ కలైంగర్ టీవీ సంస్థకు సొమ్ము బదలీ చేశారని ఎస్కే సిన్హా చెబుతున్నారని, దర్యాప్తు అధికారి సాక్ష్యాలను సేకరించాలనే విషయం గురించి ఆలోచించాలని, నేరం రుజువు చేయడానికి దర్యాప్తు అధికారి చెప్తే సరిపోదని కోర్టు అభిప్రాయపడింది. సాక్షిగా బోనులోకి వచ్చినప్పుడు దర్యాప్తు అధికారి దర్యాప్తులో తాను సేకరించిన సాక్ష్యాల గురించి వివరించాల్సి ఉంటుందని సైనీ అన్నారు.

   ఆ సంస్థలకు అనుకూలంగా ఇలా....

  ఆ సంస్థలకు అనుకూలంగా ఇలా....

  2007 సెప్టెంబర్ 25వ తేదీన కటాఫ్ డేట్‌గా నిర్ణయిచడానికి రాజా మూడు కారణాలు చెప్పారు. పెద్ద యెత్తున పెండింగ్ దరఖాస్తులు ఉండడం వల్ల, స్పెక్యూలేటివ్ ప్లేయర్స్‌ను ప్రోత్సహించకూడదని, దరఖాస్తులు స్వీకరించిన తర్వాత ట్రాయ్ నెల సమయం సిఫార్సు చేసిందని రాజా వివరించారు. దానికి కేవలం రాజాను నిందించలేమని, ఆ నిర్ణయం కుట్ర కాదని, పెద్ద యెత్తన దరఖాస్తులు రావడం వల్ల అది డా్ అధికారులు తీసుకున్న పాలనాపరమైన నిర్ణయమని, విషయం వివాదంగా మారిన తర్వాత దాని నుంచి వాళ్లు తప్పుకుంటారని కోర్టు అన్నది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Decoding the 2G spectrum verdict: Charge by charge, how the case collapsed

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి