"దమ్ముంటే కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మను తీసేయండి"
దేశంలోని ప్రతిష్టాత్మక మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) చట్టం పేరును'వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్)'.. సంక్షిప్తంగా వికసిత్ భారత్ - జీ రామ్ జీ బిల్లు అని పెట్టడంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మండిపడ్డారు. మహాత్మా గాంధీ గుర్తింపు, వారసత్వాన్ని ఎవరూ తుడిచిపెట్టలేరని స్పష్టం చేశారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) పేరును 'వికసిత్ భారత్ - గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ ఔర్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) బిల్లు- 2025'గా మార్చడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బీజేపీపై ధ్వజమెత్తారు. మహాత్మా గాంధీ గుర్తింపు, వారసత్వాన్ని ఎవరూ తుడిచిపెట్టలేరని స్పష్టం చేశారు.
పేరు మార్పు అసాధ్యమని శివకుమార్ తేల్చిచెప్పారు. కరెన్సీ నోట్లపైన ఉన్న మహాత్మా గాంధీ చిత్రాన్ని తొలగించే ధైర్యం వారికి ఉందా అని సవాలు విసిరారు డీకే శివకుమార్. "మీరు గాంధీ పేరును మార్చలేరు. ధైర్యం ఉంటే తొలగించండి. అది చేయలేరు. సాధ్యం కాదు" అని ఆయన బీజేపీను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ బిల్లు MGNREGA ను రద్దు చేసి, దాని నుండి గాంధీ పేరును తొలగిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కొత్త బిల్లులో 60:40 నిధుల విభజన వల్ల రాష్ట్రాలపై ఆర్థిక భారం మోపడమే కాకుండా.. చట్టబద్ధమైన 'పనిచేసే హక్కు' ను ఈ బిల్లు బలహీనపరుస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

లోక్ సభ శీతాకాల సమావేశాల్లో, 'వికసిత్ భారత్ - గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ ఔర్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) బిల్లు, 2025'కు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) స్థానంలో ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. 'వికసిత్ భారత్ @ 2047' లక్ష్యానికి అనుగుణంగా, ఈ బిల్లు ప్రతి గ్రామీణ కుటుంబానికి ఏడాదికి 125 రోజుల వేతన ఉపాధికి చట్టబద్ధమైన హామీని ఇస్తుంది. ఇది గ్రామీణ జీవనోపాధి, గ్రామీణ అభివృద్ధిని బలోపేతం చేస్తుంది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications