వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్కాం సొమ్ముతో గర్ల్ ఫ్రెండ్ కు ఆడీ కారు.. ఎట్టకేలకు దొరికిపోయిన షాగీ

అమెరికాలోని పన్ను ఎగవేతదారుల నుంచి రూ. 500 కోట్లు కొల్లగొట్టిన మహారాష్ట్ర థానె యువకుడు సాగర్‌ ఠక్కర్‌ అలియాస్‌ షాగీ ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయాడు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

థానే: అమెరికాలోని పన్ను ఎగవేతదారుల నుంచి రూ. 500 కోట్లు కొల్లగొట్టిన మహారాష్ట్ర థానె యువకుడు సాగర్‌ ఠక్కర్‌ అలియాస్‌ షాగీ ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయాడు. గత ఏడాది ఈ స్కాం వెలుగుచూసిన నాటినుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన షాగీని శుక్రవారం రాత్రి అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

అమెరికాలో పన్ను ఎగ్గేట్టే వారికి ఈ కాల్ సెంటర్ ముఠా కాల్స్ చేసి తాము ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్), డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రెజరీ అండ్ అధికారులుగా చెప్పి బెదిరింపులకు పాల్పడి వందల కోట్లు వసూలు చేయడం అప్పట్లో కలకలం రేపింది.

shaggy

దుబాయ్‌లో తలదాచుకున్న షాగీ జాడ గుర్తించి.. డిపోర్టేషన్‌ ముంబై ఎయిర్‌పోర్టుకు తరలించగా.. అక్కడికి వచ్చిన వెంటనే థానె కమిషనరేట్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతన్ని థానె తరలించి విచారిస్తున్నామని పోలీసులు చెప్పారు.

2013లో థానేకు చెందిన కనీసం డజను కాల్ సెంటర్లు.. అమెరికాలోని 15 వేల మంది పన్ను చెల్లింపుదారులను లక్ష్యంగా చేసుకొని ఇంటర్నల్‌ రెవెన్యూ సర్వీస్‌ కాల్‌ సెంటర్‌ కుంభకోణానికి తెరలేపాయి. ఈ స్కామ్‌లో ప్రధాన నిందితుడు సాగర్ ఠక్కర్. ఈ కుంభకోణం ద్వారా ఆర్జించిన డబ్బులో రూ. రెండుకోట్లు పెట్టి షాగీ తన గర్ల్‌ఫ్రెండ్ కు బర్త్‌డే గిఫ్టుగా ఆడి కారును ఇచ్చాడు.

థానే క్రైమ్ బ్రాంచ్ ఈ కేసుకు సంబంధించి 5000 పేజీల చార్జిషీటు ఫైల్ చేయగా, అందులో 700 మంది నిందితుల పేర్లను అందులో పేర్కొంది. ఇందుకు అనుబంధ చార్జిషీటును ఫిబ్రవరిలో చేసి అధికారులు కొంతమేర ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.

English summary
Thane : Sagar Thakkar alias ‘Shaggy’, the alleged mastermind of the Internal Revenue Service call centre scam in which thousands of Americans were defrauded to the tune of $300 million, has been arrested by Thane Police. According to Thane Police officials, Sagar, who was on the run since the unearthing of the scam last year, was placed under arrest late last night after he arrived at the Mumbai airport following his deportation from Dubai.A team of officers from Thane Police Commissionerate picked up Sagar from the airport, the officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X