ఫ్లిప్ కార్ట్ నుంచి మెగా యాప్.. ‘ఎవ్రీథింగ్’, భారీ డిస్కౌంట్లు కూడా

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ మరో సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. త్వరలోనే 'ఎవ్రీథింగ్ యాప్' పేరుతో ఓ మెగా యాప్ ను ప్రారంభించబోతోంది. ఈ ఏడాది చివరికల్లా ఈ యాప్ ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఫ్లిప్ కార్ట్ ప్రవేశపెట్టనున్న ఈ 'ఎవ్రీథింగ్ యాప్' ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు, క్యాబ్ బుక్ చేసుకోవచ్చు, నచ్చిన సినిమా టిక్కెట్లు కొనుక్కోవచ్చు, టూర్ ప్లాన్ చేసుకోవచ్చు, నచ్చిన వస్తువులు కొనుక్కోవచ్చు.

Flipkart plans to roll out the one app to rule them all

దీనికోసం ఇప్పటికే ఫుడ్, క్యాబ్, ట్రావెల్ అగ్రిగేటర్లను భాగస్వాములుగా చేర్చుకునేందుకు ఫ్లిప్ కార్ట్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మెగా యాప్ ను ఫ్లిప్ కార్ట్ యాప్ డిజైన్, ఇంజనీరింగ్ టీమ్ రూపొందిస్తోంది.

ఫ్లిప్ కార్ట్ కొత్త చీఫ్ కల్యాణ్ కృష్ణమూర్తి ప్రారంభించిన ఈ వ్యూహం, కంపెనీ ప్రకటనల వ్యాపారాలను మరింత ముందుకు తీసుకెళుతుందని ఫ్లిప్ కార్ట్ భావిస్తోంది. ఫ్లిప్ కార్ట్ ప్రస్తుతం కొనుగోలు చేస్తున్న 'స్నాప్ డీల్' కూడా గత ఏడాది ఇలాంటి ప్లానే వేసి విఫలమైనట్లు సమాచారం.

ప్రస్తుతం డిజిటల్ వాలెట్ సేవల్లో అగ్రగామిగా ఉన్న పేటీఎం కూడా ఇలాంటి సర్వీసులనే వినియోగదారులకు అందిస్తోంది. ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ గనుక ఈ 'ఎవ్రీథింగ్ యాప్'ను తీసుకొస్తే.. ఇది పేటీఎంకు గట్టి పోటీ అవుతుంది.

దీంతో పాటు విలువ ఆధారిత సేవలనూ అందించాలని నిర్ణయించామని, అతి త్వరలో ఇంటికి అవసరమయ్యే నిత్యావసరాలు, ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల విక్రయాలు ప్రారంభించనున్నామని, తొలి దశలో భారీ ఎత్తున డిస్కౌంట్లు అందిస్తామని సంస్థ మోనిటైజేషన్ సీనియర్ డైరెక్టర్ ప్రకాశ్ సికారియా పేర్కొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India's largest online marketplace Flipkart wants to be an 'everything app' that customers can tap into for ordering food, hailing a cab, planning a vacation, or buying daily essentials. The company has begun talks to partner with food, cab and travel aggregators for its app-of-apps that it plans to rollout by the end of this year. A mega app of this sort, Flipkart expects, will allow it to boost customer loyalty while also monetising the huge volumes of customer data it has access to and adding channels of revenue. Executed by Flipkart's app design and engineering team, the strategy, initiated by new chief executive Kalyan Krishnamurthy, would complement the company's advertising business.
Please Wait while comments are loading...