• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సాధారణ జీవితం, వివాదాల సుడిగుండం.. సుదీర్ఘ పోరాట యోధుడు జార్జి ఫెర్నాండేజ్

|
  Former Defence Minister George Fernandes Is No More | Oneindia Telugu

  ఢిల్లీ : కేంద్ర మాజీ రక్షణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండేజ్ రాజకీయ జీవితం స్ఫూర్తిదాయకం. సుదీర్ఘ పోరాట నాయకుడిగా ముద్రపడ్డ ఆయన ఉన్నత పదవులు నిర్వహించినా.. సాధారణ జీవితం గడిపారు. సోషలిస్టు నేతగా మొదలైన ఆయన ప్రస్థానం ఉన్నత స్థానాలకు చేరింది. దేశంలోనే అత్యంత కీలకమైన రక్షణ శాఖ ఆయన్ని వరించింది.

  పోరాటమే జీవితం

  పోరాటమే జీవితం

  1970వ దశకంలో సోషలిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు జార్జి ఫెర్నాండేజ్. జనతాదళ్ నేతగా ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. 1994లో సమతా పార్టీని స్థాపించారు. 1967లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ముంబై నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. అప్పట్లో కాంగ్రెస్ హవా ఉండేది. అయినా జార్జి ఫెర్నాండెజ్ విజయం సాధించి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. బాంబే సౌత్ సెగ్మెంట్ నుంచి సంయుక్త సోషలిస్టు పార్టీ తరపున పోటీచేసిన జార్జి ఫెర్నాండేజ్.. కాంగ్రెస్ నేతగా బాగా పాపులర్ అయిన సదాశివ్ కనోజీ పాటిల్ ను భారీ మెజార్టీతో ఓడించారు. అలా మొదలైన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఉన్నత పదవులు అలంకరించారు. అయినా కూడా సోషలిస్ట్ భావజాలమున్న జార్జి ఫెర్నాండేజ్ సాధారణ జీవితం గడపడం విశేషం.

  కార్మికులకు పెద్దన్నగా..!

  కార్మికులకు పెద్దన్నగా..!

  కర్ణాటకలోని మంగళూరులో జన్మించిన జార్జి ఫెర్నాండెజ్.. 1949లో ఉపాధి వెతుక్కుంటూ ముంబైకి చేరుకున్నారు. అప్పుడు ఆయన వయస్సు 19 ఏళ్లు. మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డారు. కొన్ని సందర్బాల్లో రోడ్ల పక్కన ఉండే బెంచ్ లపై పడుకున్నారు. ఒక దినపత్రికలో ప్రూఫ్ రీడర్ గా ఉద్యోగం దొరకడంతో కుదుటపడ్డారు.

  ప్రముఖ యూనియన్ నాయకుడు ప్లసిడ్ డి'మెల్లో, సోషలిస్టు నేత రామ్ మనోహర్ లోహియా వంటి నేతల ప్రభావంతో కార్మిక సమస్యలపై గళమెత్తారు. ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నారు. ఆ క్రమంలో సోషలిస్ట్ ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో క్రీయాశీలకంగా పాల్గొన్నారు. చిన్న తరహా పరిశ్రమలలోని కార్మికుల హక్కుల కోసం పెద్ద పోరాటమే చేశారు.

  జైలు నుంచే గెలుపు

  జైలు నుంచే గెలుపు

  అట‌ల్ బిహారీ వాజ్‌పేయి ప్ర‌భుత్వ హ‌యాంలో.. దేశంలోనే కీలక శాఖైన రక్షణ శాఖకు మంత్రిగా పనిచేశారు జార్జ్ ఫెర్నాండేజ్. అంతేకాదు రైల్వే, కమ్యూనికేషన్స్, పరిశ్రమలు లాంటి అత్యున్నత శాఖలను కూడా ఆయన నిర్వర్తించారు. 1975 నాటి ఎమర్జెన్సీ సమయంలో ఫెర్నాండేజ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. సాధారణ కార్యకర్తలతో పాటే ఆయన్ని జైలుకు పంపారు. అనంతరం బరోడా డైనమెట్ కేసులో కోల్‌కతాలో పోలీసులు అరెస్ట్ చేసి.. తీహార్ జైలుకు పంపారు. 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీహార్ లోని ముజఫర్‌పుర్ నుంచి ఎంపీగా బరిలోకి దిగారు. జైలు నుంచే ఆయన పోటీచేశారు. దాదాపు 3 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం విశేషం.

  ఎంతో పేరు.. అంతే వివాదాలు

  ఎంతో పేరు.. అంతే వివాదాలు

  కొన్ని సందర్భాల్లో కేంద్ర మంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు కొందరికి మింగుడు పడలేదు. ఐబీఎం, కోకాకోలా లాంటి విదేశీ కంపెనీలను దేశం నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆయన ఆదేశించడం చర్చకు దారి తీసింది. పెట్టుబడి విధానాలను ఆ కంపెనీలు తుంగలో తొక్కాయనేది జార్జి ఫెర్నాండేజ్ వాదన. సమర్థవంతంగా పనిచేశారనే పేరున్న జార్జి ఫెర్నాండేజ్ ను అదేస్థాయిలో ఆరోపణలు కూడా చుట్టుముట్టాయి. అణు పరీక్షలు, బారక్ మిస్సైల్ స్కాండల్, తెహల్కా.. ఇలా చాలా అంశాల్లో ఆయన వివాదాలు ఎదుర్కొన్నారు. 1967 నుంచి 2004 వరకు ఆయన 9 సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. 2009 ఆగస్టు నుంచి 2010 జులై వరకు రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఫెర్నాండేజ్. అనారోగ్యంతో కొన్నాళ్లుగా బాధపడుతున్నారు. సోషలిస్టు భావజాలంతో దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఆయన.. మంగళవారం ఉదయం (29.01.2019) కన్నుమూశారు.

  English summary
  Former Defense Minister George Fernandes's political life is inspiring. He ran a high-profile position as a long-range leader and spent a normal life. His position as a socialist leader has moved to higher positions. He worked as the most important defense minister in the country. George Fernandes, who is also known to be effective, has also been rounded up.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X