గీత దాటితే చుక్కలే: కొత్త విమానయాన నిబంధనలు ఇవే!

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఇక విమానాల్లో ప్రయాణించే సమయంలో, ఎయిర్‌పోర్టుల్లోనూ ప్రయాణికులు(ఏ స్థాయి వారైనా) జాగ్రత్తగా నడుచుకోవాల్సిందే. లేదంటే వారిపై దీర్ఘకాలిక విమాన ప్రయాణ వేటు పడనుంది. ఎందుకంటే.. కేంద్ర ప్రభుత్వం తాజాగా కఠిన నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది.

వివాదాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు అనర్హత జాబితాను శుక్రవారం పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు విడుదల చేశారు. ఇందులో ప్రయాణికుల అనుచిత ప్రవర్తనను మూడు స్థాయిలుగా పేర్కొంది.

3నెలల నుంచి 2ఏళ్లపాటు వేటు

3నెలల నుంచి 2ఏళ్లపాటు వేటు

తాజా నిబంధనల ప్రకారం.. కనిష్ఠంగా మూడు నెలల నుంచి గరిష్ఠంగా జీవితకాలం పాటు సదరు ప్రయాణికులపై నిషేధం విధించనుంది. ప్రయాణికుల భద్రతే తమకు ప్రథమ ప్రాధాన్యమని, వారి భద్రత దృష్ట్యానే ఈ నిబంధనలు తీసుకొచ్చినట్లు పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా స్పష్టం చేశారు.

నిబంధనలు ఇలా..

నిబంధనలు ఇలా..

లెవల్‌ 1 - దూషించడం, మద్యం తాగి అనుచితంగా ప్రవర్తించడం, అసభ్యంగా సైగలు చేయడం వంటివి.

ఇలాంటి చర్యలకు పాల్పడిన ప్రయాణికులపై మూడు నెలల వరకు నిషేధం విధిస్తారు.
లెవల్‌ 2 - సిబ్బందిని నెట్టడం, కొట్టడం, భౌతికంగా దాడి చేయడం, అసభ్యంగా తాకడం వంటివి
ఈ చర్యలకు ఆరు నెలల వరకు నిషేధం ఉంటుంది.

రెండేళ్ల నుంచి జీవితకాల నిషేధం..

రెండేళ్ల నుంచి జీవితకాల నిషేధం..

లెవల్‌ 3 - బెదిరింపులకు పాల్పడటం, ఎయిర్‌క్రాఫ్ట్‌ సిస్టమ్స్‌ను ధ్వంసం చేయడం వంటివి. ఇలాంటి చర్యలకు పాల్పడిన ప్రయాణికులపై కనిష్ఠంగా రెండేళ్ల నుంచి జీవిత కాలం పాటు నిషేధం విధిస్తారు.

ఈ ఘటనల వల్లే..

ఈ ఘటనల వల్లే..

ఇటీవల ఎంపీలు రవీంద్ర గైక్వాడ్‌, జేసీ దివాకర్‌ రెడ్డిలు విమానయాన సిబ్బందితో వాగ్వాదానికి దిగి, ఘర్షణ పడిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనల వల్ల ప్రయాణికుల భద్రతకు భంగం వాటిల్లుతుందని భావించిన పౌరవిమానయాన శాఖ తాజాగా నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Civil Aviation Minister Ashok Gajapathi Raju released India's first three-tier rules for a national no-fly list on Friday in an effort to keep blacklisted people off airlines to ensure safety and check unruly behaviour.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి