గుజరాత్ లో ఎవరికెన్ని? మొదటిసారి బీజేపీకి టెన్షన్ పట్టుకుందా!?
Recommended Video

అహ్మదాబాద్: గుజరాత్‌లో ఇరవై రెండేళ్లుగా అధికారం చెలాయిస్తున్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి మొట్టమొదటిసారి టెన్షన్ పట్టుకుందా? అంటే అవుననే చెప్పాలి. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థులుగా.. నువ్వా? నేనా? అన్న రీతిలో తలపడ్డాయి.
పాకిస్తాన్‌ను ఆనుకుని ఉన్న ఈ పడమటి రాష్ట్రంలో ఎన్నికల పోరు అత్యంత కీలకంగా మారింది. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ రెండూ.. బస్తీమే సవాల్ అనుకుంటూ పల్లె, పట్టణ ప్రాంతాలపై దృష్టి సారించడంతో ఎన్నికల వేడి మరింత పెరిగింది.

ఏడాది పొడవునా ఎన్నికలే...
2017.. దేశంలో ఎన్నికలకే ఊపు తెచ్చిన సంవత్సరం. ఈ ఏడాదే పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా శాసనసభలకు ఎన్నికలు జరిగాయి. ఒక్క పంజాబ్ మినహా మిగిలిన అన్నిచోట్లా కమలనాథులు పాగా వేశారు. అయినా ఆ పార్టీ నాయకుల్లో ఏదో తెలియని టెన్షన్. కారణం ఏడాది చివర్లో ఇటు గుజరాత్, అటు హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికలు రావడం. ప్రధాని మోడీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాల సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో కుడి ఎడమైతే ఎంత పరువు తక్కువ.

సర్వ శక్తులూ గుజరాత్‌పైనే...
అందుకే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలను కూడా పెద్దగా ఆ పార్టీ పట్టించుకోలేదు. సర్వ శక్తులూ గుజరాత్‌పైనే కేంద్రీకరించింది. గుజరాత్‌ను ఒక ఏలుడు ఏలిన నరేంద్ర మోడీ ఆ రాష్ట్రం నుంచి ప్రధానిగా ఎన్నికై కేంద్రానికి మారిన తరువాత తొలిసారిగా వచ్చిన ఎన్నికలివి. దీంతో బీజేపీ అగ్రనాయకత్వం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకగా తీసుకుంది. 182 స్థానాల్లో 150 స్థానాలు తమవేనంటూ ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తాను వెళ్లిన చోటల్లా.. ఎన్నికలు జరగకముందే విక్టరీ సింబల్ చూపిస్తూ ఎన్నికలను మరింత వేడెక్కించారు.

మరింత పెరిగిన మోడీ బాధ్యత...
దీనికితోడు మోడీని చూసి ఓటేయండంటూ బీజేపీ నేతలు ప్రచారం చేయడంతో ప్రధాని మోడీ బాధ్యతను మరింత పెరిగింది. దీంతో సొంత రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని మోడీ కూడా చెమటోడ్చాల్సి వచ్చింది. మరోవైపు ఎలాగైనా గుజరాత్‌లో మోడీని మట్టి కరిపించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు రాహుల్ గాంధీ అహోరాత్రులు శ్రమించారు. గుజరాత్‌లో బీజేపీ వ్యతిరేక శక్తులను కూడా ఆయన కూడగట్టడంతో ఎన్నికలు మరింత రంజుగా మారాయి.

ఎగ్జిట్ పోల్స్‌తో టెన్షన్.. టెన్షన్
తొలివిడత, మలివిడత ప్రచారంలో చాలా తేడా కనిపించింది. తొలుత రెండు పార్టీలు గుజరాత్ అభివృద్ధిపైనే ఎక్కువగా దృష్టి సారించాయి. చర్చ కూడా అదే కోణంలో జరిగింది. అయితే రెండు వారాల్లోనే పరిస్థితి మారింది. ప్రచార పర్వంలో... కులం, మందిరం, మతం పాకిస్తాన్.. కాదేదీ ప్రచారానికి అనర్హం అన్నట్లుగా ఎన్నో అంశాలు వచ్చి చేరాయి. దీంతో అధికార బీజేపీలో టెన్షన్ మొదలైంది. మొత్తానికి ప్రచారం ముగిసింది. రెండు విడతలుగా పోలింగ్ జరిగింది. పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడంతో మళ్లీ బీజేపీ అగ్రనాయకత్వానికి టెన్షన్ మొదలైంది. దీనికితోడు ప్రీపోల్ సర్వేల హడావుడి. మరి ఫలితాలు వెలువడే వరకు ఈ టెన్షన్ భరించక తప్పదేమో!
-
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications