అందాల అరుణాచల్ ప్రదేశ్.. పర్యటకులకు స్వర్గధామంగా.. ఎలా వెళ్లాలి..?
అరుణాచల్ ప్రదేశ్ లో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఓవైపు సహజసిద్దమైన ప్రకృతి సౌందర్యాలు, మరోవైపు బౌద్ధ మఠాలు, అక్కడి స్థానిక సంస్కృతి ప్రసిద్ధి చెందాయి. అరుణాచల్ ప్రదేశ్ లో తవాంగ్, జిరో వ్యాలీ, బొమ్డిలా పాస్, దిరాంగ్, సెలా పాస్, మెచుకా.. తదితర పర్యాటక ప్రాంతాలు టూరిస్టులకు స్వర్గధామంగా ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ పర్యటనకు ముఖ్యంగా అక్టోబర్ నుంచి ఏప్రిల్ మధ్యలో సందర్శనకు అనువైన సమయంగా భావిస్తారు. అయితే అరుణాచల్ ప్రదేశ్ పర్యటనకు ఇన్నర్ లైన్ పర్మిట్ తప్పనిసరి చేశారు అధికారులు.
అరుణాచల్ ప్రదేశ్ టూరిజంలో జిరో వ్యాలీ ప్రత్యేకమైనదిగా చెబుతారు. ఇది ఒక అందమైన లోయ ప్రాంతం. ఇక్కడి పచ్చని అడవులు, స్థానిక తెగల సంస్కృతి, ఇక్కడి వ్యవసాయ పద్దతులు టూరిస్టులను మైమరింపింపజేస్తాయి. జిరో వ్యాలీలో అపాతాని అనే అరుదైన తెగ నివసిస్తుంది. వారి జీవన విధానం భిన్నంగా ఉంటుంది. ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ లోయ అరుణాచల్ ప్రదేశ్ లోని లోయర్ సుబాన్సిరీ జిల్లాలో ఉంది. ఈ వ్యాలీ చుట్టూ అందమైన పర్వతాలు.. మధ్యలో వ్యవసాయ క్షేత్రాలతో జిరో ప్రాంతం ఎంతో అహ్లాదకరంగా ఉంటుంది. అలాగే వేసవికాలంలో హిల్ స్టేషన్ గానూ పర్యటకులను అలరిస్తోంది.
అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ పర్యాటక ప్రాంతం సముద్రమట్టానికి సుమారు 3,000 మీటర్లు (10వేల అడుగులు) ఎత్తులో ఉంటుంది. శీతాకాలంలో తవాంగ్ ప్రాంతం మంచుతో నిండి ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో పర్యాటకులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. అలాగే ఈ ప్రాంతంలోని బౌద్ధ మఠాలు సైతం కనువిందు చేస్తాయి. ఇక్కడికి దగ్గరలోనే గొరించేన్ శిఖరం, షాంగత్సర్ సరస్సు, నౌరంగ్ జలపాతం, పాన్ కాంగ్ తెంగ్ సరస్సు, బుమ్లా పాస్.. తదితర ప్రాంతాలు పర్యాటక ప్రాంతాలుగా అలరిస్తున్నాయి.
అలాగే అరుణాచల్ ప్రదేశ్ లోని లోయర్ దిబాంగ్ వ్యాలీ జిల్లాలో ఉన్న రోయింగ్ ప్రాంతం కూడా గొప్ప పర్యటక ప్రదేశంగా పేరుపొందింది. ప్రకృతి ప్రేమికులకు, సాహస యాత్రికులకు ఈ ప్రాంతం అనువైనదిగా చెబుతారు. ఈ రోయింగ్ ప్రాంతం దిబాంగ్ నది ఒడ్డున ఉంటుంది. ఈ ప్రాంతం మంచుతో నిండిన పర్వతాలు, లోతైన లోయలు, జలపాతాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి మయుడియా పాస్, భీష్మక్ నగర్ కోట, మెహావో లేక్, నెహ్రూ వన్ ఉద్యాన్ పర్యటకులను విశేషంగా అలరిస్తున్నాయి.

మరి అరుణాచల్ ప్రదేశ్ ను ఎలా చేరుకోవాలంటే.. గౌహతి, షిల్లాంగ్ ల నుంచి రోడ్డు మార్గంలో అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటా నగర్ చేరుకోవాలి. ఇక విమానంలో వెళ్లాలనుకునేవారు కోల్ కతా ఎయిర్ పోర్టు నుంచి లిలాబరీకి చేరుకోవాలి. అక్కడ నుంచి సుమారు 140 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఇక హైదరాబాద్ నుంచి వెళ్లాలనుకునే పర్యటకులు గౌహతి ఎయిర్ పోర్టులో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఇటానగర్ చేరుకోవాల్సి ఉంటుంది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications