నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పిఎస్ఎల్‌వి-సి26 ప్రయోగం విజయవంతం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

శ్రీహరికోట: సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి గురువారం తెల్లవారుజామున 1.32గంటలకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్(పిఎస్ఎల్‌వి)-సి26 నిప్పులు చిమ్మూతూ సగర్వంగా నింగిలోకి దూసుకెళ్లింది. బుధవారం నుంచి ఉరుములు, మెరుపులతో వర్షం కురవడం.. వాతావరణ మార్పులు సంభవించడంతో ప్రయోగాన్ని వాయిదా వేస్తారా? లేక కొనసాగిస్తారా అనే సందేహాలు వచ్చినప్పటికీ.. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ గురువారం తెల్లవారుజామున చేసిన ఈ ప్రయోగం విజయవంతమవడంతో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు. పిఎస్ఎల్‌వి-26.. ఐఆర్ఎన్ఎస్ఎస్-1సి ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చింది.

బుధవారం ఉదయం నుంచి ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఉదయం 5.30గంటలకు మొదటి ప్రయోగ వేదికపై పిఎస్ఎల్‌వి వాహకనౌకతో ఉండిన మొబైల్ సర్వీసు టవర్‌ను వెనక్కు పంపి, పిఎస్ఎల్‌వి-సి26లో ద్రవ ఇంధనం నింపాల్సి ఉంది. సాధారణంగా వాతావరణ మార్పులు ఏర్పడి ఉరుములు, మెరుపులు ఏర్పడితే కౌట్‌డౌన్ పనులు నిలిపేస్తారు. ఈ నేపథ్యంలోనే ఉదయం 5.30గంటలకు మొబైల్ సర్వీసు టవర్(ఎంఎస్‌టి)ను రాకెట్ నుంచి వెనక్కు పంపలేదు.

పిఎస్ఎల్‌వి-సి26 ప్రయోగం

పిఎస్ఎల్‌వి-సి26 ప్రయోగం

సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి గురువారం తెల్లవారుజామున 1.32గంటలకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్(పిఎస్ఎల్‌వి)-సి26 నిప్పులు చిమ్మూతూ సగర్వంగా నింగిలోకి దూసుకెళ్లింది.

పిఎస్ఎల్‌వి-సి26 ప్రయోగం

పిఎస్ఎల్‌వి-సి26 ప్రయోగం

బుధవారం నుంచి ఉరుములు, మెరుపులతో వర్షం కురవడం.. వాతావరణ మార్పులు సంభవించడంతో ప్రయోగాన్ని వాయిదా వేస్తారా? లేక కొనసాగిస్తారా అనే సందేహాలు వచ్చినప్పటికీ.. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ గురువారం తెల్లవారుజామున చేసిన ఈ ప్రయోగం విజయవంతమవడంతో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు.

పిఎస్ఎల్‌వి-సి26 ప్రయోగం

పిఎస్ఎల్‌వి-సి26 ప్రయోగం

పిఎస్ఎల్‌వి-26 వాహక నౌక ఐఆర్ఎన్ఎస్ఎస్-1సి ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చింది.

పిఎస్ఎల్‌వి-సి26 ప్రయోగం

పిఎస్ఎల్‌వి-సి26 ప్రయోగం

ఐఆర్ఎన్ఎస్ఎస్-1సి ఉపగ్రహం నిర్ణీత కక్ష్యలోకి చేరడంతో శాస్త్రవేత్తల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

పిఎస్ఎల్‌వి-సి26 ప్రయోగం

పిఎస్ఎల్‌వి-సి26 ప్రయోగం

శాస్త్రవేత్తలు పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. కాగా, ఈ ప్రయోగంతో ఇస్రో తన ఖాతాలో మరో విజయాన్ని చేర్చుకుంది.

వర్షం, ఉరుములు, మెరుపులు తగ్గిన తర్వాత ఉదయం 8.30గంటలకు సమయంలో మొబైల్ సర్వీసు టవర్‌ను రాకెట్ నుంచి వేరుచేసి, వెనక్కు పంపారు. అనంతరం మూడు గంటల ఆలస్యంగా పిఎస్ఎల్‌వి వాహకనౌకలో ద్రవ ఇంధనం నింపారు. మరికొన్ని పరీక్షలు నిర్వహించారు. పిఎస్ఎల్‌వి ప్రయోగం సమయంలో 58 గంటలపాటు కౌంట్ డౌన్ ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ దఫా పిఎస్ఎల్‌వి-సి26కు 67 గంటలు కౌంట్ డౌన్ నిర్వహించారు. రాత్రి వేళల్లో కొన్ని పనులు చేయకూడదని శాస్త్రవేత్తలు నిర్ణయించుకుని, 67గంటలపాటు కౌంట్ డౌన్ ఉండేలా చూశారు.

ఇప్పటికే ఒసారి ఈ ప్రయోగాన్ని వాయిదా వేసిన శాస్త్రవేత్తలకు హుధుద్ భయం పట్టుకుంది. చివరకు దాని ప్రభావం నెల్లూరు జిల్లా వైపు లేకపోవడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఊపిర పీల్చుకున్నారు. అన్ని అడ్డకుండలనూ అధిగమించి పిఎస్ఎల్-26 ప్రయోగం ప్రయోగం గురువారం(అక్టోబర్ 16) వేకువజామున 1.32గంటలకు చేయాలని అక్టోబర్ 12వ తేదీన జరిగిన రాకెట్ సన్నద్ధత సమావేశంలో శాస్త్రవేత్తలు నిర్ణయించారు. దీంతో 13వ తేదీ నుంచి రాకెట్ కౌంట్ డౌన్ ప్రారంభమైంది.

చివరకు శాస్త్రవేత్తలు నిర్ణయించిన మేరకు గురువారం తెల్లవారుజామున 1.32గంటలకు పిఎస్ఎల్‌వి-సి26 వాహక నౌక చిమ్మ చీకట్లో నింగివైపు దూసుకెళ్లింది. ఐఆర్ఎన్ఎస్ఎస్-1సి ఉపగ్రహం నిర్ణీత కక్ష్యలోకి చేరడంతో శాస్త్రవేత్తల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. శాస్త్రవేత్తలు పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. కాగా, ఈ ప్రయోగంతో ఇస్రో తన ఖాతాలో మరో విజయాన్ని చేర్చుకుంది.

English summary
India successfully launched IRNSS 1C on board ISRO’s PSLV C26 rocket from the spaceport at 1.32 am on Thursday, moving a step closer to setting up the country’s own navigation system on par with Global Positioning System (GPS) of the US.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X