విమర్శలు చుట్టుముట్టిన వేళ.. పార్లమెంట్ లో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన
దేశంలో అతిపెద్ద పౌర విమానయాన సంస్థ ఇండిగో ఫ్లైట్లు నేడు కూడా రద్దయ్యాయి. 20 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు 550కి పైగా విమానాలను రద్దు చేసింది. దీనివల్ల దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ అంతరాయం వేలాది మంది ప్రయాణికులను గంటల తరబడి ఎయిర్ పోర్టుల్లో పడిగాపులు పడేలా చేసింది. అక్కడే చిక్కుకుపోయేలా చేసింది. ఇండిగో విమాన ప్రయాణికులు నరకం చవి చూస్తోన్నారు.
షెడ్యూల్ మార్పులు, సరైన సమాచారం లేకపోవడంతో వందలాది మంది ప్రయాణికులు సతమతం అవుతున్నారు. సిబ్బంది నుంచి ఎటువంటి సమాచారం కూడా వారికి అందట్లేదు. ఎప్పుడు పునరుద్ధరణకు నోచుకుంటాయో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రముఖులకూ ఈ ఆటంకాలు తప్పలేదు. నేడు కూడా ఈ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. దాదాపుగా అన్ని విమానాశ్రయాల్లోనూ ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు.

ఈ పరిణామాలపై పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాజ్యసభలో మాట్లాడారు. దీనికి గల కారణాలను వివరించారు. కీలక ప్రకటన చేశారు. విమానాలు ఆలస్యంగా రాకపోకలు సాగిస్తోండటం, రద్దు వల్ల లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటోన్నారని అంగీకరించారు. ఈ ఉదంతంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించామని తెలిపారు. ఇండిగో సిబ్బంది రోస్టరింగ్, అంతర్గత ప్రణాళిక వ్యవస్థలో సమస్యల కారణంగా ఈ సంక్షోభం తలెత్తిందని, ఏవియేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కారణం కాదని స్పష్టం చేశారు.
రెగ్యులేషన్స్ కు సంబంధించి కఠినమైన పౌర విమానయాన నియమాలు ఇప్పటికే అమల్లో ఉన్నాయని, అన్ని పౌర విమానయాన సంస్థలు కూడా వీటిని తప్పకుండా పాటించాలని రామ్మోహన్ నాయుడు చెప్పారు. సాఫ్ట్వేర్ సమస్యపై విచారణ జరుగుతోందని, ఈ రంగంలో నిరంతరం సాంకేతికతను మెరుగుపర్చడానికి తమవంతు ప్రయత్నాలు సాగిస్తోన్నామని అన్నారు. దేశంలో విమానయాన రంగానికి అత్యున్నతమైన, ప్రపంచ స్థాయి ప్రమాణాలను తీసుకురావాలన్నది తమ ఉద్దేశమని వివరించారు.
విమానయాన రంగంలో మరింత పోటీ అవసరమని కింజరాపు స్పష్టం చేశారు. సంక్షోభానికి తలెత్తిన తొలి రోజు నుంచి ఇండిగో యాజమాన్యంతో నిరంతరం సంప్రదింపులు జరిపుతున్నామని తెలిపారు. విమానాల రద్దు వల్ల ప్రజలకు కలిగిన తీవ్ర అంతరాయంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. వారికి కలిగిన అసౌకర్యానికి, అదనపు ఖర్చు భరించాల్సి రావడం పట్ల చింతిస్తున్నానని అన్నారు. విమానాల రద్దుల వల్ల 5.86 లక్షల మంది ప్రయాణికులు ప్రభావితం అయ్యారని, వారికి రూ. 5.6 కోట్లు రీఫండ్ చెల్లించినట్లు వెల్లడించారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications