చొరబాటుకు యత్నం: ఇద్దరు ఉగ్రవాదులను కాల్చిపడేశారు
ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత భద్రతా దళాలు తిప్పికొట్టాయి. శనివారం ఉదయం జమ్మూకాశ్మీర్‌లోని కుప్వారా జిల్లా మచిల్ సెక్టార్‌ల్లో చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు.
కుప్వారా: ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత భద్రతా దళాలు తిప్పికొట్టాయి. శనివారం ఉదయం జమ్మూకాశ్మీర్‌లోని కుప్వారా జిల్లా మచిల్ సెక్టార్‌ల్లో చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు వెంటనే వారిపై కాల్పులు జరిపాయి.
ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో బలగాలు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నాయి. పాకిస్థాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పద ఉల్లంఘనకు పాల్పడిన సమయంలోనే ఈ చొరబాటు యత్నం జరిగింది.

ఇది ఇలా ఉండగా, బీఎస్‌ఎఫ్ జవాన్ల శిబిరాలను లక్ష్యంగా చేసుకొని శనివారం పాకిస్థాన్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ దళాలు కాల్పులు జరిపాయి. ఉదయం 6.45 గంటల సమయంలో కాల్పులు ఆగినట్లు బీఎస్‌ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. పాక్ కాల్పుల కారణంగా ఒక ఆలయం, రెండు ఇళ్లు దెబ్బతిన్నాయి.












Click it and Unblock the Notifications