• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సెంట్రల్ జైల్లో శశికళ లగ్జరీ లైఫ్, ఫోటోలు లీక్, ఐదు గదుల్లో మొత్తం, దీన్ని జైలు అంటారా ?

|

బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళ లగ్జరీ లైఫ్ గడుపుతున్నారని వెలుగు చూసింది. ఆమె శిక్ష అనుభవిస్తున్న జైలు గదుల ఫోటోలు లీక్ అయ్యాయి. ఒక లాకప్ (జైలులోని సెల్)లో ఇద్దరు లేదా ముగ్గురు ఖైదీలు ఉంటారు.

శశికళ దెబ్బకు సెంట్రల్ జైలు చీఫ్ ఔట్, ఎక్కడా పోస్టింగ్ లేదు, ఆ స్థానంలో ఓ మహిళ !

ఐదు లాకప్ లకు కలిసి ఓ హాల్ ఉంటుంది. అయితే మొత్తం ఐదు గదులు చిన్నమ్మ శశికళకు కేటాయించారు. సర్వసాదారణంగా మనం ఇంటిలో తలుపులు, కిటికీలు కనపడకుండా అందంగా ఆకర్షణీయంగా ఉండటానికి కర్టన్లు వేసుకుంటుంటాం. అయితే శశికళ శిక్ష అనుభవిస్తున్న లాకప్ లకు అలాంటి అలంకరణ చేశారని వెలుగు చూసింది.

అసలు దీన్ని జైలు అంటారా ?

అసలు దీన్ని జైలు అంటారా ?

జైల్లో శశికళ శిక్ష అనుభవిస్తన్న లాకప్ ఫోటోలు లీక్ కావడంతో వాటిని చూసిన వారు ఎవరైనా అసలు దీన్ని జైలు అంటారా ? లాకప్ అంటారా ? అనే అనుమానం వస్తుంది. లాకప్ లో ఊచలు కనపడకుండా మొత్తం కర్టన్లతో నింపేశారు. అసలు ఈ ఫోటోలుచూసిన వారు ఎవరైనా దీన్ని జైలు అంటారా అనే అనుమానం వస్తోంది.

  Sasikala bribes prison officers, gets luxury treatment in jail | Oneindia News
  జయలలిత చీరలు ?

  జయలలిత చీరలు ?

  శశికళ శిక్ష అనుభవిస్తున్న లాకప్ లో ఆకుపచ్చ చీరలు (జయలలిత చీరలు) స్పష్టంగా కనపడుతున్నాయి. అంతే కాకుండా గోడకు ఏర్పాటు చేసిన రాకర్లలో కుక్కర్లు, శశికళ కోసం వంట చెయ్యడానికి ప్రత్యేకమైన పాత్రలు, పరుపు, శశికళకు అవసరమైన అన్ని వస్తువులు కనపడుతున్నాయి.

  హాల్ లో టేబుల్, టీవీ, కుర్చీలు

  హాల్ లో టేబుల్, టీవీ, కుర్చీలు

  శశికళ కుర్చోవడానికి ప్రత్యేకమైన కుర్చీలు, టేబుల్, టైం పాస్ కోసం చూడటానికి టీవీ ఏర్పాటు చేశారు. తనను కలవడానికి వచ్చే బంధువులు, అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) వర్గంలోని నాయకులతో మాట్లాడటానికి ప్రత్యేకంగా కుర్చీలు ఏర్పాటు చేసుకున్నారు.

  వంట సామాగ్రి

  వంట సామాగ్రి

  శశికళకు మొత్తం ఐదు లాకప్ లు కేటాయించారని ఆరోపణలు ఉన్నాయి. ఆ ఐదు లాకప్ లకు కర్టన్లు వేశారు. హాల్ లో శశికళ కోసం వంట చెయ్యడానికి అవసరం అయిన ఆహారపదార్థాలు పెట్టిన విషయం ఈ ఫోటోలలో స్పష్టంగా కనపడుతోంది.

   జైలు జీవితం అని గుర్తు రాకుండా !

  జైలు జీవితం అని గుర్తు రాకుండా !

  తాను జైల్లో శిక్ష అనుభవిస్తున్నాను అని గుర్తుకు రాకుండా శశికళ అన్ని ఏర్పాట్లు చేయించుకున్నారు. జైల్లో శశికళ లగ్జరీ లైఫ్ గడుపుతున్నారని డీఐజీ రూప ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఫోటోలు బయటకు రావడంతో అందులో ఎలాంటి అనుమానం లేదని స్పష్టంగా తెలుస్తోంది.

  జయలలిత ఇక్కడే

  జయలలిత ఇక్కడే

  అక్రమాస్తుల కేసులో గతంలో పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు వెళ్లిన జయలలిత కూడా ఈ గదుల్లో ఉన్నారని జైలు సిబ్బంది అంటున్నారు. జయలలిత ఉన్న గదులే నాకు కావాలని చిన్నమ్మ శశికళ పట్టుపట్టి తీసుకున్నారని సమాచారం.

  ఇరకాటంలో ప్రభుత్వం

  ఇరకాటంలో ప్రభుత్వం

  శశికళ శిక్ష అనుభవిస్తున్న గదుల ఫోటోలు బయటకు రావడంతో కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఈ ఫోటోలు అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోయడానికి సిద్దం అయ్యారు. అయితే ఈ ఫోటోల విషయంలో ప్రభుత్వం కాని, అధికారులు కాని ఇంత వరకు నోరు విప్పకపోవడం కొసమెరుపు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  AIADMK general secretary Sasikala enjoying all facilities within prison photos leaked amidst charges raised by DIG Roopa. There were 5 rooms alloted for Sasikala for watching TV, doing Yoga, meeting with visitors etc.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more