వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జియో బంపర్ ఆఫర్... రూ.999కే ‘జియోఫై’ డివైజ్!

టెలికాం మార్కెట్లో ఇప్పటికే సంచలనం సృష్టిస్తోన్న రిలయన్స్‌ జియో తమ ఖాతాదారులకు మరో బంపర్‌ ఆఫర్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో హాట్‌ స్పాట్‌ ను ధరను సగానికి పైగా తగ్గించింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: టెలికాం మార్కెట్లో ఇప్పటికే సంచలనం సృష్టిస్తోన్న రిలయన్స్‌ జియో తమ ఖాతాదారులకు మరో బంపర్‌ ఆఫర్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో హాట్‌ స్పాట్‌ ను ధరను సగానికి పైగా తగ్గించింది.

'జియో ఫై' 4 జీ హాట్ స్పాట్ పై ప్రత్యేక ఆఫర్ ను ప్రకటించింది. రూ. 1000 డిస్కౌంట్‌ తో పదిరోజుల పాటుచెల్లుబాటయ్యేలా పండుగ ఆఫర్‌ను లాంచ్‌ చేసింది. దసరా పండుగను పురస్కరించుకొని ప్రవేశపెట్టిన ఈ ఆఫర్ కింద జియో ఫై ధరను రూ. 999 గా (వాస్తవ ధర 1999) నిర్ణయించింది. సెప్టెంబర్ 20 నుంచి 30 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

4జీ ఫోను లేకపోయినా... అదే వేగంతో...

4జీ ఫోను లేకపోయినా 4జీ వేగంతో డేటా, కాలింగ్ సదుపాయాలు పొందగలిగే సౌకర్యాన్ని జియో ఫై కల్పిస్తుంది. అలాగే వినియోగదారులు 3జీ లేదా 2జీ స్మార్ట్ ఫోన్లలో, ల్యాప్ టాప్ లలో జియో యొక్క అద్భుతమైన సేవలను పొందవచ్చు.

JioFi hotspot dongle on sale at big discount as price slashed by over 50 percent

దీంతో కుటుంబ సభ్యులు లేదా చిన్న సంస్థలోని సిబ్బందిని జియో డిజిటల్ లైఫ్ కి అనుసందానం చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, టాబ్లెట్ తదితర 10 నుంచి 32 వైఫై పరికరాలను జియో ఫై డివైజ్ తో అనుసంధానం చేసుకోవచ్చు.

ఎలా పనిచేస్తుందంటే...

2జీ, 3జీ ఫోన్లలో జియో ఎలా పనిచేస్తుందనే సందేహం చాలా మందికి కలగవచ్చు. ప్రతీ జియో ఫై తో ఒక జియో సిమ్ వస్తుంది. ఈ పరికరంలో సిమ్ వేసిన తరువాత ఇది వైఫై హాట్ స్పాట్ గా పనిచేస్తుంది.

ఆ తరువాత 'జియో 4జీ వాయిస్' అప్లికేషన్ ను ప్లే స్టోర్ నుండి మీ 2జీ, 3జీ స్మార్ట్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని గంటల్లో సిమ్ ఆక్టివేట్ కాగానే జియో ఫై ద్వారా ఫ్రీ వాయిస్ కాల్ సేవలు, 4 జీ డేటా సేవలను పొందవచ్చు.

కాల్ చేసిన వ్యక్తికి మీ 10 అంకెల జియో ఫై నంబరు కనపడుతుంది. తిరిగి ఆ వ్యక్తి మీకు అదే నంబరు కు కాల్ చేయవచ్చు. దీంతో.. వీవోఎల్టీఈ ద్వారా వీడియో, హెచ్‌డీ కాల్స్, ఇప్పుడు 2జీ, 3జీ స్మార్ట్ ఫోన్లలోనూ అందుబాటులో ఉంటాయి.
అంతేకాదు వినియోగదారులు స్పష్టమైన హెచ్‌డీ వాయిస్ తో జియో నెట్ వర్క్ లో ఉండే వారితో మాట్లాడగలరు. జియో ఫై ఇప్పుడు దగ్గరలోని జియో రిటైల్ స్టోర్లతో పాటు జియో వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది.

ఈ డివైజ్ మొదటిసారిగా సెప్టెంబర్ 2016లో విడుదల అవగా.. అప్పట్లో దీని ధర రూ. 2,899 ఉండేది. ఆ తర్వాత దీని ధరని రూ. 1,999గా కంపెనీ నిర్ణయించింది. ఇప్పుడు తాజాగా రూ.999కే ఇస్తోంది. త్వరపడండి.. కొనేందుకు పది రోజులే గడువుంది!

English summary
The season of discount has begun and Reliance Jio doesn't want to miss on it. The company has announced a new offer for the JioFi buyers. It has reduced the price of its JioFi device from Rs 1999 to Rs 999, a price cut of Rs 1000 under the offer. Also, the offer is valid only on JioFi M2S model and this offer cannot be merged with any other offer. The JioFi device was launched in September 2016. The device claims to offer speed of up to 150Mbps and upload speed of 50Mbps. The JioFi device can connect up to 32 devices. The 2300mAh battery claims to offer 5 to 6 hours of usage time. User can also install Jio4GVoice App on the 2G/3G smartphone to make Video & HD Voice Calls using JioFi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X